ఎంతకైనా పోరాటం చేస్తాం. ఎంతో రిస్క్ చేసి, పంటలు పండిస్తే ఇన్ని అవరోధాలా. కేంద్రం సమర్థత సరిగా లేదు. దేశంలో ఇలాగే ముందుకు పోతే నష్టాల పాలవుతారు జనం. ప్రజలకు జరుగుతున్నది తెలపాలి. మోడీకి చేతులెత్తి నమస్కరించి అడుగుతున్నాం. బీజేపీకి ఉద్యోగాలివ్వడం తేలీదు. ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ చేయడం లేదు. ఇది రైతుల జీవన్మరణ సమస్య. రాజ్యాంగ విధి నుంచి కేంద్రం పారిపోవద్దు. కరోనాలాంటిది వస్తుందని మనం భావించామా? వారం పాటు దేశానికి అన్నం పెట్టే అవకాశం వుందా? బఫర్ స్టాక్ మెయింటైన్ చేయాలి. క్రైసిస్ నుంచి బయటపడేలా కేంద్రం ముందుకెళ్లాలి. రైతులు పండించే ధాన్యం తీసుకోవాలి. నష్టం వచ్చినా మీరు భరించాలి. మేం భారత రైతుల కోసమే అడుగుతున్నాం. అమెరికా రైతుల గురించి కాదు.
ఈ కాశ్మీర్ ఫైల్స్ ఏంటి? ప్రజల్లో విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూడడానికి సెలవులు ఇస్తున్నారు. దేశం ఎటువైపు పోతోంది? భారతదేశంలో ఐటీ రంగంలో అంతర్జాతీయ కంపెనీలు పనిచేస్తున్నాయి. కోట్లాదిరూపాయలు ఎగుమతి అవుతున్నాయి. వందశాతం కేంద్ర ప్రభుత్వ అసమర్థత బయటపడింది. కరోనా వల్ల బాధపడిన జనాన్ని ఆదుకోలేకపోయింది. వేలకిలోమీటర్లు బతకడానికి నడిచి వెళ్ళిన దారుణ, దౌర్భాగ్య పరిస్థితులు బీజేపీలో తప్ప ఎక్కడా లేవు. గంగా నదిలో కూడా వేలాది శవాలు బయటపడ్డాయి.
యూపీయే ప్రభుత్వం బాగాలేదని బీజేపీకి అధికారం ఇస్తే అంతకంటే దారుణంగా పరిస్థితులు తయారయ్యాయి. నిరుద్యోగుల రేటు బాగా పెరిగింది. జీడీపీ తగ్గింది. రెండు మూడు విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మా సామర్ధ్యం ఇదే అని కేంద్రం చెప్పుకుంది. ఒక్క ఫ్యాక్టరీ పెట్లలేదు. వున్నవి అమ్మేస్తున్నారు. అయితే డీమానిటైజేషన్.. లేదంటే మానిటైజేషన్ చేసుకోవాలంటున్నారు. పంచాయితీ రాజ్ ఆస్తులు మోనిటైజ్ చేసుకోమంటున్నారు.
రాజకీయంగా చాలా దారుణమయిన పరిస్థితులున్నాయి.యూపీ, ఉత్తరాఖండ్ లో బీజేపీ బలం తగ్గుతోంది. ఇది స్పష్టమయిన పరిస్థితి. దేశం ఒక నిర్ణయానికి వచ్చింది. 8 ఏళ్ళు గడిచింది. బీజేపీ ప్రభుత్వం వచ్చి. ఏదైనా మంచి చేయాలి. మంచి ఆవిష్కరణలు జరగాలి. ఇది ఎంతో ఎక్కువ టైం. ఒక ప్రాజెక్ట్ కట్టలేదు. దేశం బాగుపడాలంటే.. ఈ ప్రభుత్వం పోవాలని నిర్ణయానికి వచ్చింది.
మేం చాలా కష్టపడి పంటలు పండిస్తున్నాం. ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నాం. రైతుల ముఖాల్లో సంతోషం కనిపిస్తోంది. ధాన్యం సేకరణకు నిబంధనలు పెట్టకుండా.. యాసంగి పంటలో వచ్చే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నాం. కాలికి వేస్తే మెడకు.. మెడకేస్తే కాలికి వేయకూడదు. ధాన్యం కొనుగోలుకు దేశమంతా ఒకటే విధానం వుండాలి.
ఎంఎస్‌పీ నిర్ణయించేది ధాన్యానికి.. బియ్యానికి కాదు. 30 లక్షల ఎకరాల్లో పండిన పంట కొనాలి. రైతుల కు సంబంధించింది. తెలంగాణ ప్రభుత్వం చర్యల్ని హర్షించి, ధాన్యం మొత్తం కొనాలి. ఆహార శాఖ మంత్రిని కలిసి కోరతాం. ఎలాంటి పోరాటాలకైనా సిద్ధం అవుతాం. ప్రజస్వామ్యయుతంగా ఆందోళనలు వుంటాయి. తెలంగాణ ఉద్యమం తరహాలో పోరాటం చేస్తాం. చివరి గింజ కొనేవరకూ ఉద్యమం వుంటుంది. మంత్రులు కేంద్రమంత్రుల్ని కలుస్తారు. కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నాం. గతంలో పంజాబ్ రైతుల్ని ఏడిపించారు. ధాన్యం కొనుగోలుకు మెలికలు పెట్టకూడదు. మా దగ్గర ధాన్యం తీసుకోండి. దానిని ఏ రైస్ చేసుకుంటారో మీ ఇష్టం.
ఈ నెల 28,29 న జరిగే ట్రేడ్ యూనియన్ల ఆందోళనకు టీఆర్ఎస్ మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. కేంద్రం తీరుపై టీఆర్ఎస్ ఎల్పీలో సుదీర్ఘ చర్చ జరిగింది. యాసంగి వరిని పంజాబ్ నుంచి కొన్నట్లే తెలంగాణ నుంచి కొనుగోలు చేయాలని తీర్మానించాం. ప్రపంచ జనాభాలో రెండవ అతి పెద్ద దేశం మనది. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ద్వారా ప్రజలకు ఆహార భద్రత కల్పించాలి. పండిన పంటను దాచిపెట్టాలి. కరువు కాలంలో అది ఉపయోగపడుతుంది. ఎక్కువ పంట పండినప్పుడు దానిని సేకరించాలి. కేంద్రం 10వేల కోట్లు నిధి పెట్టి కొనుగోలు చేయాలి. తన బాధ్యతల నుంచి కేంద్రం తప్పించుకోకూడదు.
కేంద్రం ధాన్యం సేకరించాలి. మంత్రుల టీం ఢిల్లీకి వెళ్లనుంది. తెలంగాణ రైతుల పక్షాన కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేయనున్నాం.
పోరాటాల సీజన్ ప్రారంభం అయ్యిందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు కోసం పోరుబాటకు సిద్ధం అవుతోంది తెలంగాణ సర్కార్. తెలంగాణ భవన్ లో గాని, జంతర్ మంతర్ లో గాని ఆందోళనలు చేయాలని భావిస్తోంది. ఏప్రిల్ 2 తర్వాత ఢిల్లీలో నిరసనకు రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీలు ,మండల పరిషత్ లు,జిల్లా పరిషత్ లలో పంజాబ్ తరహాలో 100 శాతం కేంద్రం వరి ధాన్యం సేకరణ చేయాలని రేపటి నుంచి తీర్మానాలు చేయనున్నారు. ఏప్రిల్ రెండు లోపు తీర్మానాలు ప్రక్రియ పూర్తి చేయలని కేసీఆర్ ఆదేశించారు. విభజన హామీలపై రేపటి నుంచి పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళనలు నిర్వహించనున్నారు.