విజయ రామరాజు టైటిల్ రోల్ పోషించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాని నిర్మాత శ్రీని గుబ్బల నిర్మించారు. 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అందుకున్న ఈ సినిమా ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ అందుకుంది. ప్రేక్షకులు, విమర్శకుల నుండి అద్భుతమైన స్పందనను పొందింది. సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపధ్యంలో మేకర్స్ థాంక్ యూ మీట్ నిర్వహించారు.
Also Read:Nenu Ready: హవీష్, నక్కిన ‘నేను రెడీ’ షూట్ మొదలు!
థాంక్ యూ మీట్లో నిర్మాత శ్రీని గుబ్బల మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సినిమాని సపోర్ట్ చేసిన మీడియా మిత్రులు అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమాకి వచ్చిన రివ్యూస్, మేము ఇన్స్టాగ్రామ్ లో చేసిన సర్వే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యే అయ్యాయి. ఇంత అద్భుతమైన స్పందన ఇచ్చిన మీడియా మిత్రులకు నమస్కరిస్తున్నాను అంటూ మోకాళ్లపై నిలబడి థాంక్స్ చెప్పారు. యుఎస్ లో ఇండియాలో ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేశారు. సినిమాకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు అని అంటూ సినిమాకి వచ్చిన రివ్యూస్ గురించి ఆయన మాట్లాడారు.