KTR Tweet: కాంగ్రెస్ పై ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెడతాం.. అప్పుల అంశంపై కేటీఆర్ ట్వీట్..
- కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెడతాం..
- రాష్ట్రంలో కేసీఆర్ రూ.7 కోట్లు అప్పులు చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపణలపై కేటీఆర్ ట్వీట్ ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR Tweet: కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.. బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ అధోగతి పాలయ్యిందని, కేసీఆర్ రూ.7 కోట్లు అప్పులు చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని బీఆర్ఎస్ నేతలు ఖండించారు. ఇవాళ (సోమవారం) ఎక్స్ వేదిక ద్వారా అప్పుల వ్యవహారంపై కేటీఆర్ స్పందించారు.
Read also: Ex MLA Shakeel Son: నేడు పోలీసుల విచారణకు మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్..
Also Read
రాష్ట్ర అప్పులు రూ.7 లక్షల కోట్లు అని చెప్పి అసెంబ్లీని, తెలంగాణ ప్రజలను పదే పదే తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెడతాం. ఆర్‌బీఐ నివేదిక ప్రకారం.. అప్పు కేవలం రూ. 3.89 లక్షల కోట్లు. అయితే అప్పుల గురించి ఆర్థిక మంత్రి ప్రసంగం రూ. 7 లక్షల కోట్లు అనేది పూర్తిగా అవాస్తవమని కేటీఆర్ పేర్కొన్నారు. భారత రాష్ట్రాలపై గణాంకాల హ్యాండ్ బుక్ నివేదిక తేల్చిచెప్పిందని అన్నారు. ఆర్థిక మంత్రి ఉద్దేశపూర్వకంగానే బీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పులపై తప్పుడు సమాచారం ప్రచారం చేస్తూ ప్రతిష్టను దిగ జార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే తెలంగాణ శాసనసభ విధివిధానాల రూల్ 168 (1) కింద ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు బీఆర్‌ఎస్ శాసన సభా పక్షం పార్టీ తరపున సభా హక్కుల ఉల్లంఘన నోటీసును అందజేస్తున్నామని కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
We will be moving a privilege motion against the Congress Govt for its repeated attempts to mislead the legislature & the people of Telangana by stating that the total state debt is 7 lakh crore where as RBI report exposed their lies stating that the debt is only 3.89 lakh crore… pic.twitter.com/Of7N3Yk0I1
— KTR (@KTRBRS) December 16, 2024
Telangana Cabinet Meeting: నేడు రాష్ట్ర కేబినెట్ సమావేశం.. అసెంబ్లీ కమిటీహాల్‌లో భేటీ..
తాజావార్తలు
-
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!