Telangana Assembly Live 2024: తెలంగాణ అసెంబ్లీ ఉభయ సభలు మూడో రోజు కూడా కొనసాగుతున్నాయి. ఉభయ సభలు ప్రశ్నోత్తరాల కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి. ఉభయ సభల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానమిస్తున్నారు. ఈ ప్రశ్నోత్తరాల కార్యక్రమం శాసనసభ, శాసనమండలిలో గంటపాటు కొనసాగనుంది.
నిన్న రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో లగచర్ల రైతులకు వేసిన బేడీ అంశంపై చర్చించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టడంతో శాసనసభలో గందరగోళం నెలకొంది. దీంతో విపక్ష సభ్యులు ప్లకార్డులతో నినాదాలు చేశారు. స్పీకర్ అనుమతించకపోవడంతో పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో స్పీకర్ సభను మంగళవారానికి వాయిదా వేశారు. అంతకుముందు ఉదయం ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ ల బకాయిల చెల్లింపులపై మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. ఈ అంశంపై ప్రభుత్వం ప్రకటన చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. తమకు ఆశించిన స్పందన రాకపోవడంతో నిరసనగా శాసనసభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం మళ్లీ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ మళ్లీ ప్రారంభం కానుంది.
జీఎస్టీ సవరణ బిల్లును మంత్రి శ్రీధర్‌బాబు సభలో ప్రవేశపెట్టారు. బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్య బిల్లును సభ ఆమోదించింది. అనంతరం టూరిజం పాలసీపై చర్చ జరుగుతోంది.
అమర వీరుల ఆకాంక్షలు ఇప్పుడిప్పుడే నెరవేరుతున్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పదేళ్లు మీరు చేయని పనులు మేము చేస్తున్నామని బీఆర్‌ఎస్ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వచ్చే నాలుగేళ్లలో గ్లోబల్ టూరిజం ప్లేస్‌గా తెలంగాణ మారుతుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు.
పర్యాటక రంగంలో తెలంగాణ 9వ ప్లేస్‌లో ఉన్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పర్యాటకం అనేది ఒకప్పుడు విలాసం అని.. ఇప్పుడు నిత్యావసరమని పేర్కొన్నారు.
సభలో తెలంగాణ యూనివర్సిటీ సవరణ బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ ప్రవేశ పెట్టగా.. సభ ఆమోదం తెలిపింది.
సభ్యుల ఆందోళన మధ్యలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది.
శాసన మండలి ఛైర్మన్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
శాసన సభలో ప్రభుత్వ బిల్లులను మంత్రి కొండా సురేఖ ప్రవేశ పెడుతున్నారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లును మంత్రి సభలో ప్రవేశ పెట్టారు.
శాసన మండలిలో బీఆర్ఎస్ సభ్యుల నిరసన నేపథ్యంలో శాసనమండలి బుధవారానికి వాయిదా పడింది. రైతులకు బేడీలా, సిగ్గు సిగ్గూ అంటూ బీఆర్‌ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. శాసన మండలి వెల్‌లో ప్లకార్డులు పట్టుకుని బీఆర్‌ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.
తెలంగాణ అసెంబ్లీలో వాయిదా తీర్మానాల తిరస్కరణ..
ముగిసిన జీరో అవర్..
తెలంగాణ అసెంబ్లీకి టీ బ్రేక్..
శాసన మండలిలో భోజన విరామం..
కూలగొట్టిన ఇళ్లకు ఉన్న ఈఎంఐలను ప్రభుత్వం చెల్లిస్తుందా ? అని ఎమ్మెల్సీ కవిత శాసన మండలిలో ప్రశ్నించారు. 181 కుటుంబాలు తామంతట తామే కూల్చేసుకొని వెళ్లిపోయారని ప్రభుత్వం చెబుతోంది… ఇది వినడానికి కూడా హాస్యాస్పదంగా ఉందన్నారు. మూసీ నిర్వాసితుల విషయంలో మానవీయ కోణంలో ఆలోచించాలన్నారు.
మూసీ నదిగర్భంలో నివసించే 309 కుటుంబాలు వాళ్లంతట వాళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారని ప్రభుత్వం చెబుతోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కానీ హృదయవిదారకమైన వీడియోలను చూస్తే ప్రభుత్వం చెబుతున్నది అవాస్తవమని స్పష్టమవుతోందన్నారు. ఆ 309 కుటుంబాలు సమ్మతిస్తూ ఏవైనా పత్రాలపై సంతకాలు చేసి ఉంటే అవి సభకు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.
సభను తప్పుదోవ పట్టిస్తే అవసరమైతే... ప్రివిలేజ్ మోషన్ ను ప్రవేశపెడుతామని శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మూసి కోసం రూ 14,100 కోట్ల వ్యయం అవుతుందని, నిధులతో పాటు అనుమతులు ఇప్పించాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఏ ప్రాతిపదికన అడిగారననారు. ఒక వేళ కేంద్రాన్ని సాయం కోరడం, ప్రపంచ బ్యాంకు సాయం కోరడం వాస్తవమైతే సభను, ప్రజలను ఎందుకు తప్పదోవపట్టిస్తున్నారు ? అని కవిత ప్రశ్నించారు.
ప్రపంచ బ్యాంకును ప్రభుత్వం ఆశ్రయించిన విషయం వాస్తవమా కాదా? అని శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. మూసి నది విషయంలో డీపీఆర్ ఆధారంగా అంచనా వ్యయాలు ఉంటాయని ప్రభుత్వం చెబుతోందన్నారు. కానీ 4100 కోట్లు కావాలని ప్రపంచ బ్యాంకును ప్రభుత్వ ఆశ్రయించినట్లు నిర్ధిష్టమైన సమాచారం ఉంది మాకని తెలిపారు. డీపీఆర్ తయారు కాలేదని ప్రభుత్వం ఈ రోజు సభకు చెప్పిందన్నారు. ఏ తేదీన ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు సాయం కోరుతూ ప్రతిపాదనలు పంపించింది? అని కవిత ప్రశ్నించారు.
మాకు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటమే తెలుసు.. టిఆర్ఎస్ వాళ్ళ లాగా యాక్టింగ్ రాదని శాసన మండలిలో సీతక్క అన్నారు. బీఆర్ఎస్ నుంచి హుందాతనం నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. బీఆర్ఎస్ వాళ్లు మాట్లాడితే నిలువెల్లా అహంకారమే కనిపిస్తోందన్నారు. ఏడు సంవత్సరాల తర్వాత డైట్ చార్జీలను పెంచాం, 16 ఏండ్ల తర్వాత కాస్మొటిక్ చార్జీలను పెంచామన్నారు.
జరుగుతున్న ఘటనలపై మాకు అనుమానాలు ఉన్నాయి..బయటకు తీస్తామని మంత్రి సీత్క అన్నారు. నిమ్స్ లో శైలజను మంత్రులు, సీఎంవో సిబ్బంది నిరంతరం పర్యవేక్షించారన్నారు. మీ హయాంలో నిరుద్యోగులు చనిపోతే తల్లిదండ్రులకు శవాలను కూడా చూపించలేదని తెలిపారు. మీ హయాంలో గురుకులాల్లో విద్యార్థులు చనిపోతే కనీసం పట్టించుకోలేదన్నారు. మీ హయాల్లో గురుకులాల కార్యదర్శిగా పనిచేసిన అధికారి.. పదవికి రాజీనామా చేశాక మీ పై ఎన్నో ట్వీట్స్ చేశారని గుర్తుచేశారు.
గురుకులాల్లో కలుషిత ఆహార ఘటనలపై శాసన మండలిలో మంత్రి సీతక్క సమాధానం ఇచ్చారు. మా ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందన్నారు. హాస్టల్ సిబ్బందితోపాటు సప్లయర్లపై నిఘా పెడతామన్నారు. మీ పాలనలో 70 ఘటనలు, 5024 మంది విద్యార్థులు అస్వస్థతకి గురయ్యారన్నారు. వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలకు చెందిన శైలజను బతికించేందుకు కష్టపడ్డామన్నారు.
పరిపాలన పరంగా ఉన్న ఇబ్బందులు సరిదిద్దుతం మంత్రి పొంగులేటి అన్నారు. త్వరలో అందరితో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు.
కొన్ని నియోజక వర్గాలు మూడు..నాలుగు జిల్లాల్లో ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఒక నియోజకవర్గం నాలుగు రెవెన్యూ డివిజన్ లాల్లో ఉన్నవి కూడా ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం ఎందుకు ఇలా చేసిందో కానీ... చెల్లాచెదురుగా విభజన చేసిందని మంత్రి అన్నారు.
విభజన చేసే విధానం సరికాదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అవకాశం ఉంటే...మండలాలు.. రెవెన్యూ డివిజన్ లు ఏర్పాటు చేస్తామన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన డివిజన్ లలో సిబ్బంది కేటాయింపు లేదన్నారు. పూర్తిస్థాయిలో కార్యాలయాలు..సిబ్బంది ఏర్పాటు చేస్తామన్నారు.
మా బావ గారూ.. అంటూ కోమటిరెడ్డి నీ మంత్రి పొంగులేటి సభలో ప్రస్తావించారు. చేర్యాల రెవెన్యూ డివిజన్ ప్రశ్నకు సమాధానం చెప్పే అంశంలో బావ అంటూ ప్రస్తావన.
సభలో చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమాధానం చెప్పారు. చేర్యాల రెవెన్యూ డివిజన్ చేయండి అని అన్నారు. గత ప్రభుత్వం తప్పు చేసిందన్నారు. ప్రజా పాలన అని మనకు ప్రజలు పట్టం కట్టారన్నారు. ప్రభుత్వం చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయండని మంత్రి అన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఐటీ ఉద్యోగాలు పొందేందుకు స్కిల్ ట్రైనింగ్ ఇస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. స్కిల్స్ ఉన్న వారు ఇప్పటికే ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 3 లక్షలకు ఐటీ ఎగుమతులు చేరాయన్నారు. ఫాక్స్ కాన్ మల్టీ నేషనల్ కంపెనీ ఎక్కడికి పోలేదు రాష్ట్రంలోనే ఉందన్నారు. త్వరలోనే ఫాక్స్ కాన్ మల్టీ నేషనల్ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతుందన్నారు. టీఎస్ ప్రైడ్ యధావిధిగా కొనసాగిస్తున్నామని తెలిపారు.
ఐటీ రంగమనేది టాలెంట్ ఆధారంగా నడుస్తుంది శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్ర ఐటీ రంగం అభివృద్ధి చెందాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ కి హైదరాబాద్ లో గ్లోబల్ సమీట్ నిర్వహించామన్నారు. అంతర్జాతీయ సంస్థలన్నీ తీసుకురావడంతో పాటు స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరముందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం FRBM పరిధి దాటి లక్ష 27 వేల కోట్ల అప్పు తీసుకుందని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. రాయదుర్గం భూమిని ప్రవేటు వారికి తాకట్టు పెట్టాలని అనుకోవడం బాధాకరమన్నారు. ఆరు గ్యారంటీలకు చట్ట బద్దత కల్పిస్తామని చెప్పారు.. ఎందుకు చట్ట బద్దత కల్పించలేదన్నారు. ఇంత అప్పు చేసినా పప్పు కూడా తినుడు అవుతుందని తెలిపారు.
ఓఆర్ఆర్ మేము ఆస్తి క్రియేట్ చేస్తే.. బీఆర్ఎస్ వాళ్ళు అమ్ముకున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. వాళ్ళ లాగ ముపై ఏళ్ల కు అమ్ముకోలేదన్నారు. ముప్పై ఎండ్లకు వచ్చే డబ్బులు తీసుకున్నారు. ముప్పై యేండ్ల డబ్బులు వాళ్ళే తీసుకుంటే..తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఎట్లా నడుస్తాయన్నారు.
అసెంబ్లీని పిడిఎస్‌యూ ముట్టడించారు. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ అసెంబ్లీని ముట్టడించించారు. అసెంబ్లీ వద్ద పిడిఎస్‌యూ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల కాలంలో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలను, విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. నిబంధనలో ఉల్లంఘిస్తున్న కార్పోరేట్ విద్యాసంస్థలపై చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలంటూ అసెంబ్లీని ముట్టడించారు.
ధాన్యం కొన్న మూడు రోజులకే డబ్బులు ఇస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మీ మోకానికి పదేళ్లలో ఎప్పుడైనా ఇచ్చారా..? అని ప్రశ్నించారు.
బోనస్ కూడా సన్నాలకి ఇస్తున్నామన్నారు. మా నియోజక వర్గం లో చిట్టిబాబు అనే రైతు నాకు మేసేజ్ పెట్టారన్నారు. బోనస్ నాకు వచ్చింది... మంచి జరిగింది అన్నారని తెలిపారు.
40 వేల కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అప్పులు కడుతూ... పెండింగ్ బిల్లులు చెల్లిస్తూ పోతున్నామన్నారు. 40 వేల కోట్లలో 14 వేల కోట్లు చెళ్ళించామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కోరుకునే వాళ్ళు దీన్ని తప్పు పట్టారన్నారు.
లక్ష కోట్ల అప్పు చేయలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. 52 వేల కోట్లు అప్పు చేశాం - అప్పులకు 65 వేల కోట్లు కట్టామన్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భవిష్యత్తులో సీఎం అవుతారని మాజీ సీఎం హరీష్ రావు అన్నారు. భట్టి... డిప్యూటీ సీఎం... మీరు డిప్యూటీ స్పీకర్ అన్నారు. భవిష్యత్ లో సిఎం అవుతారేమో అని అసెంబ్లీలో హరీష్ రావు మాటలు.
పోచారం స్పీకర్ గా ఉన్నప్పుడు నిర్ణయం ఆయన చేసుకున్నారన్నారు. కానీ గడ్డం ప్రసాద్ చెప్పింది మాత్రం లేదు.. మేము వినం అంటున్నారన్నారు. పోచారం కి ఒక గౌరవం... స్పీకర్ గా ప్రసాద్ కుమార్ గారికి ఇచ్చే గౌరవం ఇదా..? అని ప్రశ్నించాఉ. ఇదేం పద్ధతి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
అలా శాసించడం ఏంటి అధ్యక్ష చైర్ నీ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సభాపతి అంటే గౌరవం ఉండొద్ద అన్నారు. బీఏసీలో పదేళ్లు ఏం చేశారన్నారు.
మీకేం చర్చ చేయాలో స్పీకర్ కి ఇవ్వండి అని అప్పట్లో చెప్పే వారన్నారు. నిన్న మేము కూడా అదే చెప్పినం అన్నారు. స్పీకర్ కి మీరు ఏం చర్చ చేయాలని అనుకుంటున్నారో ఇవ్వండి అన్నామన్నారు. లేదు... అది కరెక్ట్ కాదు.. అని వాకౌట్ చేశారన్నారు.
మమల్ని వికారాబాద్ ప్రజలు చూస్తున్నారని అసెంబ్లీలో హరీష్ చెప్పడంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పందించారు. వికారాబాద్ ప్రజలే కాదు హరీష్ రావు గారు రాష్ట్ర ప్రజలు కూడా చూస్తున్నారని తెలిపారు.
మాకు మాత్రమే నీతులు స్పీకర్ చెబుతున్నారు. వారికి చెప్పారా అని స్పీకర్ కు హరీష్ రావు ప్రశ్నించారు. వాళ్లు మాత్రం రాజకీయం అన్నీ విషయాలపై చర్చించవచ్చా అని ప్రశ్నించారు.
ప్రజల కోసం పని చేసే మాపై ప్రివిలేజ్ మోషన్ అంట అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అధికారం పోయాకా.. అంత మర్చిపోయారన్నారు.
ప్రశ్నోత్తరాలలో ఎలా ఉండాలి అనేది హరీష్ రావుకు తెలియదు అనుకుంట అని డిప్యూటీ సిఎం భట్టి అన్నారు. షార్ట్ డిస్కషన్ లో లాగా మాట్లాడుతున్నారన్నారు. అప్పుల పై చర్చకు మేం సిద్ధమన్నారు. మీలాగా మేము వెనక్కి పోమని తెలిపారు.
51 వేలు కోట్లు అప్పున్నారు.. ఇవాళ ఇంకో మూడు వేల కోట్లు అప్పు తీసుకున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ ఏడాదిలో లక్ష 27 వేల కోట్లు అప్పు వుందని, ఐదేళ్లలో 6 లక్షల కోట్లు చేయబోతోందన్నారు. బీఆర్ఎస్ 7 లక్షల కోట్ల అప్పు అని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిందన్నారు.
సర్వే లో 4 లక్షల 49 వేల ఇళ్లకు తాగునీరు నల్లా కనెక్షన్లు లేవనీ గుర్తించామని మంత్రి సీతక్క అన్నారు. 3 లక్షల 21 వేల ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఏర్పాటు చేశామన్నారు. ఇంకా లక్షా 28 వేల ఇళ్లకు తాగునీరు నల్లా కనెక్షన్లు అందించాల్సిన అవసరముందన్నారు.
రాష్ట్రంలో కొత్త నల్లా కనెక్షన్ల కోసం పెండింగ్ లో ఎలాంటి అప్లికేషన్లు లేవని మంత్రి సీతక్క అన్నారు. 2021 వరకు 53 లక్షల 98 వేల ఇళ్లకు 100 శాతం తాగునీరు అందుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జూన్, జులై లో గ్రామీణ ప్రాంతాలలో ఇంటింటి సర్వే చేశామన్నారు.
అసెంబ్లీ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ నిరసన చేపట్టారు. డిప్యూటీ సీఎం ను పిలిపించాలని నిరసన చేశారు. దీంతో స్పీకర్ పిలుపిస్తున్నానని చెప్పిన బీఆర్ఎస్ నిరసన ఆపలేదు. దీంతో స్పీకర్ హరీష్‌రావుపై సీరియస్ అయ్యారు. హరీష్ రావు గారు మీరు ప్రతివిషయానికి ఈవిధంగా చేయకండి అంటూ సీరియస్ అయ్యారు.
తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు ప్రారంభమయ్యాయి. శాసన సభలో బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన చేపట్టారు. డిప్యూటీ సిఎం నీ సభలోకి పిలవాలని డిమాండ్.
కక్షపూరిత రాజకీయాలు కాంగ్రెస్ మానుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద గౌడ్ అన్నారు. బాంబుల శాఖా మంత్రి దాగుడు మూతలు ఎందుకు ఆడుతున్నారు? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి, మంత్రులు ఎన్ని కుట్రలు పన్నినా తిప్పికొడతామన్నారు. గవర్నర్ నుండి పర్మిషన్ వచ్చింది అని సంకలు గుద్దుకుంటున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారో స్పష్టం చేయలేదన్నారు. అసెంబ్లీ సమావేశాల ఎజెండా ఖరారు చేయలేదన్నారు.
కేటీఆర్ బామ్మర్ధి ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయని ఇరికించే ప్రయత్నం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద గౌడ్ అన్నారు. మహిళా మంత్రితో కేటీఆర్ పై వ్యక్తిగత ఆరోపణలు చేయించారన్నారు. లగచర్ల లో రైతులు తిరుగుబాటు చేస్తే కేటీఆర్ పేరు ఎఫ్.ఐ.ఆర్ లో చేర్చారన్నారు. కేటీఆర్ ను ఎట్లా అరెస్టు చేయాలని క్యాబినెట్ లో చర్చించారన్నారు. రాష్ట్ర ప్రజల గురించి క్యాబినెట్ లో చర్చ జరగలేదన్నారు. ఎలాంటి విచారణకు అయినా కేటీఆర్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన పేరును బాంబులేటి శ్రీనివాస్ రెడ్డి గా మార్చుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద గౌడ్ అన్నారు. కేటీఆర్ ను ఫార్ములా ఈ రేస్ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాలేశ్వరం కూలిపోయిందని అసత్య ప్రచారం చేశారన్నారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో ఇరికించే ప్రయత్నం చేశారన్నారు.
శాసన మండలి ప్రారంభం
అసెంబ్లీలో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల వినూత్న నిరసన చేపట్టారు. చేతులకు బేడీలు వేసుకొని ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. నల్ల చొక్కాలు ధరించి నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం లాటి రాజ్యం లూటీ రాజ్యం... రైతులకు బేడీల సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డిపై ప్రివిలేజ్ మోషన్ పెట్టాలని స్పీకర్ ను బీజేఎల్పీ కోరింది. కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలోని ప్రధాన హామీలైన ఆరు గ్యారంటీలను బాండ్ పేపర్ల రూపంలో ప్రజలకు ఇచ్చి ఎన్నికల్లో గెలిచింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 2023 డిసెంబర్ 07న సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాక ఆడు గ్యారంటీల ఫైలు పైనే తొలి సంతకం చేశారు. క్యాబినెట్ తొలిభేటిలో కూడా ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించారు. అందుకే ముఖ్యమంత్రిపై ప్రివిలేజ్ మోషన్ పెట్టాలని కోరుతున్నాం.
బ్లాక్ షర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు. నిన్న లగచర్ల ఘటనపై చర్చకు అనుమతించకపోవడంతో నిరసన తెలియజేస్తూ బ్లాక్ షర్ట్ లతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తున్నారు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ ఈ రోజు వాయిదా తీర్మానం ఇచ్చింది. రాష్ట్రంలో పరిశ్రమల కోసం సాగుభూముల సేకరణను ఆపివేయలని, అరెస్ట్ అయిన రైతులను విడుదల చేయాలని వాయిదా తీర్మానం.