Banjara Hills: తెలంగాణలో విద్యుత్ బిల్లుల బకాయిలకు వెళ్ళిన లైన్ ఇన్స్పెక్టర్ కు షాక్ తగిలింది. బకాయిలు చెల్లించమని అడిగిన లైన్ ఇన్స్పెక్టర్ పై మరో యువకుడు భూతులు తిడుతూ పొట్టు పొట్టు కొట్టారు. ఎందుకు కొడుతున్నావంటూ ప్రశ్నించినా.. అతనిపై ఆ యువకుడు విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ ఘటన నగరంలో సంచలనంగా మారింది.
Read also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
బంజారాహిల్స్ సర్కిల్ లో లైన్ ఇన్స్పెక్టర్ రోజూ లాగానే ఇంటింటికి తిరుగుతూ విద్యుత్ బకాయిలపై సమాచారం ఇస్తూ ఈతేదీ లోపు చెల్లించాలని కోరుతూ వెళుతున్నాడు. అయితే ఓ ఇంటి వద్దకు వెళ్లి విద్యుత్ బకాయిలు చెల్లించాలని కోరాడు. దీనిపై లైన్ ఇన్స్పెక్టర్ ను ఇద్దరు యువకులు ఎందుకు చెల్లించాలని కోరారు. విద్యుత్ బకాయిలు వుందని మీరు కట్టకపోతే లైన్ కట్ చేయాల్సి ఉంటుందని తెలిపాడు. దీంతో రెచ్చిపోయిన యువకులు లైన్ ఇన్స్పెక్టర్ పై విచక్షణా రహితంగా దాడికి దిగారు. లైన్ ఇన్స్పెక్టర్ ను దుర్భాష లాడుతూ పొట్టుపొట్టు కొట్టాడు. లైన్ ఇన్స్పెక్టర్ పొట్టలో పిడుగుద్దులు కొట్టడంతో దీంతో లైన్ ఇన్స్పెక్టర్ అక్కడే కూలబడిపోయాడు.
Read also: Raj Tarun-Malvi Malhotra: రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా మెసేజ్ చాట్స్ లీక్.. పలుమార్లు హోటల్‌లో..!
అయినా ఆ యువకుడు ఎగురుతూ అతని పై దాడిచేశాడు. ఇంతలో అక్కడకు వచ్చిన స్థానికులు దాడి చేస్తున్న యువకుడిని పక్కకు లాగారు. అయినా ఆ యువకుడు లైన్ ఇన్స్పెక్టర్ ను, అతనితో వచ్చిన వారితో వాదనలకు దిగాడు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. దాడిలో గాయపడిన లైన్ ఇన్స్పెక్టర్ సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు. కేస్ నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే బకాయిలు వున్నా ఇప్పటి వరకు కట్టపోగా లైన్ ఇన్స్పెక్టర్ పై ఆ యవకుడు దాడిపై విద్యుత్ అధికారులు సీరియస్ అవుతున్నారు. అయితే 200 యూనిట్లు లోపు విద్యుత్ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు.. యూనిట్ 200 కంటే విద్యుత్ బిల్లు చెల్లించాల్సి ఉంటుందని ఆదేశాలు కూడ జారీ చేసిన విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఆ యువకుడిపై విచారణ చేపడతామని మండిపడ్డారు. ఇలా లైన్ ఇన్స్పెక్టర్ దాడులు సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Daggubati Purandeswari: బీజేపీలో చేరిన పలువురు వైసీపీ నేతలు.. ఎన్డీఏ కూటమితోనే ప్రగతి సాధ్యం..