సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడిన ఆది శ్రీనివాస్… ‘కేటీఆర్.. నువ్వెన్ని పెడబొబ్బలు పెట్టినా ఏం ఉపయోగం లేదు. మా ముఖ్యమంత్రి పైన పిచ్చి పిచ్చిగా వాగినంత మాత్రాన నువ్వు పెద్ద మొగోడివి కావు’ అని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నంత కాలం కేటీఆర్, కేసీఆర్ ఇద్దరు కలిసి తెలంగాణను దోచుకున్నారని ఆరోపించారు. ‘మీ బతుకు, నీ అయ్య బతుకు…
హరీష్ రావు పార్టీ పెడతారు అని ప్రచారం జరుగుతుంది.. అందుకే బుజ్జగించడానికి కేటీఆర్ ఆయన ఇంటికి వెళ్లాడని ఆరోపించారు. అయితే, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నలుగురే.. ఇప్పుడు నలుగురే అని పేర్కొన్నారు. హరీష్ ఇంటికి కేటీఆర్ వెళ్లి పార్టీలో ఉండాలని బ్రతిమిలాడుకుంటున్నాడని ఆది శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. తమ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసే వైఖరి మానుకోవాలని హితవు పలికారు. ఉదయం లేచిన దగ్గర నుంచి కేటీఆర్ తిట్ల దండకం అందుకుంటున్నారని ఆరోపించారు.
బీఆర్ఎస్ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పాడి కౌశిక్ రెడ్డి బూడిద రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇసుక, ఎర్రమట్టి దందా యథేచ్ఛగా నడిపారని పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పని బూడిదలాగ అయినాక బూడిద రాజకీయం చేస్తుందని విమర్శించారు. రోజుకు 50 లక్షలు సంపాదిస్తున్నారని ఆరోపణలు చేస్తున్న మీరు.. 10 ఏళ్లలో ఎంత సంపాదించారు? అని ఆయన ప్రశ్నించారు. ఎన్టీపీసీ పనులు ప్రారంభించిన నాటి నుండి బూడిదను…