కరీంనగర్ నగరం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంది అని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టాక చెప్పిన మాటలు ప్రస్తుతం నిజం అవుతున్నాయని ఆయన వెల్లడించారు. నగరం రోడ్ల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.. రాష్ట్రంలో రెండవ నగరంగా కరీంనగర్ అభివృద్ధి చెందింది అని మంత్రి గంగులా అన్నారు.
Read Also: Andhra Pradesh: అమ్మపై అధికారులకు బాలిక ఫిర్యాదు.. చదువంటే ప్రాణం మరి..!
మానేర్ నది రివర్ ఫ్రంట్ గా మారింది.. మానేర్ రివర్ ప్రంట్ లో ఇరవై శాతం పనులు పూర్తి అయినవి.. ఎనభై శాతం పనులు పూర్తి కావల్సి ఉంది అని మంత్రి గంగులా కమలాకర్ పేర్కొన్నారు. ఆగష్టు నెలలో బ్యారేజీలో నీటిని నింపుతామని ఆయన వెల్లడించారు. వంద కోట్లతో టూరిజం పనులు ప్రారంభం అయినవి అని మంత్రి గుర్తు చేశారు.
Read Also: New Delhi: ప్రధాని ఇంట్లో బీజేపీ అత్యవసర భేటీ .. 2024 ఎన్నికల వ్యూహాంపై చర్చ
సౌత్ కొరియా, యోసోలో ఉన్న ఫౌంటెన్ ను అధ్యయనం చేయడానికి ఇవాళ వెళ్తున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. యోసోలో ఉన్న సౌకర్యాలను.. హంగులు కరీంనగర్ రివర్ ఫ్రంట్ లో తీసుకువస్తామన్నాడు. ఆసియా లోనే టాప్ రివర్ ఫ్రంట్ గా కరీంనగర్ మానేర్ నదీ తీరం ఉంటుంది అని తెలిపారు. రివర్ ఫ్రంట్ కరీంనగర్ కు ఒక అసెట్ గా ఉంటది.
Read Also: Man kills Friend: దారుణం.. బీమా డబ్బుకు ఆశపడి స్నేహితుడిని చంపి, తానే చనిపోయానని నమ్మించి..
ముగ్గురు మంత్రులం.. ముగ్గురు అధికారులతో కూడిన బృందం దక్షిణ కొరియాలో పర్యటించి అక్కడ ఉన్న యోసోలోని ఫౌంటెన్ ను పూర్తిగా అధ్యయనం చేసి వస్తామని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.