Kalvakuntla Kavitha : యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. స్వామివారి ఆశీర్వాదం తీసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత మాట్లాడుతూ.. “సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్‌లో ఉన్నప్పటికీ, రాజకీయాల గురించి తప్పకుండా మాట్లాడుతాను. ప్రజలకు మేలు జరగాలంటే పార్టీలు అవసరం అనేది తప్పనిసరి కాదు. ప్రజలు కోరుకుంటే, సమయం వచ్చినప్పుడు పార్టీ వస్తుంది” అని అన్నారు.
జాగృతి పార్టీగా మారడం పెద్ద విషయం కాదని, కానీ అది సమయం, సందర్భం, ప్రజల అవసరాలపై ఆధారపడి ఉంటుందని కవిత స్పష్టం చేశారు. “ప్రజా సమస్యలను అర్థం చేసుకోవడమే మా లక్ష్యం. అందుకే ప్రతి జిల్లాలో ప్రజలతో నేరుగా మాట్లాడేందుకు ‘జనం బాట’ కార్యక్రమం ప్రారంభించాం” అని తెలిపారు. అంతేకాకుండా.. “మొత్తం 33 జిల్లాల్లో నాలుగు నెలల పాటు ‘జనం బాట’ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రతి జిల్లా కేంద్రంలో రెండు రోజులు గడిపి స్థానిక సమస్యలను తెలుసుకుంటాం. మేధావులు, మహిళలు, యువతతో సమావేశమవుతాం. ప్రభుత్వం చేస్తున్న పనితీరు, ప్రతిపక్షాల వైఖరి గురించి కూడా ప్రజలతో చర్చిస్తాం” అని చెప్పారు. అలాగే, యాదగిరిగుట్ట ఆలయ పవిత్రతను కాపాడేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. “జనం బాట అవాంతరాలు లేకుండా సాగేందుకు స్వామివారిని ప్రార్థించాను. ప్రజలకు మేలు జరిగేలా జాగృతి తన శక్తి సామర్థ్యాలను వినియోగిస్తుంది” అని ఆమె పేర్కొన్నారు.
YCP ZPTC Murder: వైసీసీ జడ్పీటీసీ దారుణ హత్య.. ఇద్దరు మహిళలు సహా ఏడుగురు నిందితుల అరెస్ట్..