CM Revanth Reddy : పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్‌పై చర్చకు త్వరలో అసెంబ్లీ సమావేశాలు
- పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్‌పై చర్చకు త్వరలో అసెంబ్లీ సమావేశాలు
- అసెంబ్లీ, మండలిలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ
- రాజకీయ కక్ష సాధింపు చర్యలకు కాకుండా
- కమిషన్ నివేదిక ఆధారంగా అసెంబ్లీలో చర్చిస్తామన్న రేవంత్ రెడ్డి
- అసెంబ్లీలో అన్ని పార్టీలకు మాట్లాడే అవకాశం ఇస్తామన్న సీఎం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణలో అత్యంత చర్చనీయాంశంగా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కమిషన్ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ నివేదికను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశం అనంతరం ప్రకటించారు.
సీఎం రేవంత్ మాట్లాడుతూ, “కమిషన్ నివేదికలోని ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించాము. ఈ నివేదికను త్వరలోనే తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టి, అన్ని రాజకీయ పార్టీలకు తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశం కల్పిస్తాము,” అని తెలిపారు. ఆయన స్పష్టం చేస్తూ, “ఈ నివేదిక ఎవరిపైనా కక్షసాధింపు కోసం కాదు. ప్రజాహిత దృష్టితోనే ఈ చర్యలు చేపడుతున్నాం,” అన్నారు.
Also Read
Donald Trump: భారత్‌కు పిడుగులాంటి వార్త! టారిఫ్‌లు మరింత పెంచుతా.. ట్రంప్ హెచ్చరిక!
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఈ నివేదికపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ, “ప్రభుత్వం ఈ నివేదికను తయారు చేయలేదు. ఇది స్వతంత్ర న్యాయ విచారణ కమిషన్ సమర్పించిన నివేదిక,” అని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై ప్రజలకు స్పష్టత కల్పించడమే ఈ కమిషన్ ఉద్దేశమని పేర్కొన్నారు.
భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మేడిగడ్డ వద్ద కాళేశ్వరం బ్యారేజీ నిర్మాణంలో జరిగిన తీరుతెన్నులు ప్రజాధన దుర్వినియోగానికి దారితీశాయి. నిపుణుల విశ్లేషణల ప్రకారం, సుమారు లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ప్రమాదకర స్థితిలో ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని భవిష్యత్తు కార్యాచరణను రూపొందించి, కమిషన్ సూచనల అమలుకు తగిన చర్యలు చేపట్టనుంది.
తాజావార్తలు
-
Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
-
AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
-
Kavitha : బతుకమ్మ సాక్షిగా కవిత కీలక ప్రకటన.. మహిళలకు 50 శాతం సీట్లు..
-
OnePlus 16: వన్‌ప్లస్ 16 విడుదల.. 200MP కెమెరా, 9,000mAh బ్యాటరీ.. 185Hz డిస్ప్లేతో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్!
-
Anganwadi Recruitment : వికారాబాద్ జిల్లాలో అంగన్వాడీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!