WCL 2025 Final: బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) ఫైనల్ మ్యాచ్‌ను దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ దుమ్ముదులిపారు. పాకిస్తాన్ ఛాంపియన్స్ పై 9 వికెట్ల భారీ తేడాతో ఘన విజయం సాధించి తొలిసారి చాంపియన్లగా నిలిచారు. చివరిసారి భారత్ ఛాంపియన్స్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇకపోతే WCL 2025 ఫైనల్ మ్యాచ్ మొత్తం ఏకపక్షంగా సాగింది. దీనికి కారణం ఎవరో కాదు.. ఏబీ డివిలియర్స్. అవును కేవలం 60 బంతుల్లోనే 120 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో పాకిస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ భీకర ఇన్నింగ్స్ లు కేవలం ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గానే కాక, సిరీస్ మొత్తంలో 429 పరుగులు చేయడంతో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా కూడా అందుకున్నాడు.
Army Recruitment Rally: కాకినాడలో రేపటి నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ ఛాంపియన్స్‌కు శుభారంభం లభించలేదు. కామ్రాన్ అక్మల్ తొందరగా ఔటవ్వగా.. కెప్టెన్ హఫీజ్ కొద్దీమేర స్కోర్ చేసి వెనుదిరిగాడు. కానీ శర్జీల్ ఖాన్ 44 బంతుల్లో 76 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను సరిదిద్దాడు. ఆ తర్వాత ఉమర్ అమిన్ (36 నాటౌట్), ఆసిఫ్ అలీ (28) చివర్లో ఫర్వాలేదనిపించారు. ఇలా పాక్ మొత్తంగా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 195 పరుగుల మంచి స్కోరునే చేసింది. ఇక సఫారీ బౌలర్లలో విల్జోయెన్, పర్నెల్ చెరో 2 వికెట్లు తీశారు.
Shubman Gill: అతడు ఓ అద్భుతం.. విజయానికి మేము అన్ని విధాలా ఆర్హులం!
ఇక ఆ తర్వాత అసలు గేమ్ మొదలయింది. 196 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ప్రారంభంలో హషీమ్ ఆమ్లా (18) త్వరగా వెనుదిరిగినా, ఆ తర్వాత ఏబీ డివిలియర్స్, జేపీ డుమినీల జోడీ పాక్ బౌలింగ్‌పై విరుచుకుపడింది. ముఖ్యంగా డివిలియర్స్ శివతాండవం చేసాడని చెప్పవచ్చు. అతడు ఈ ఇన్నింగ్స్ లో తనదైన స్టైల్లో 12 ఫోర్లు, 7 సిక్సులతో 120 పరుగులు చేయగా, డుమినీ కూడా 50 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కేవలం 16.5 ఓవర్లలోనే విజయానికి అవసరమైన పరుగులను సాధించి విజయాన్ని సొంతం చేసుకున్నారు.
Congratulations @ABdeVilliers17 #WCL2025 #WCL2025Final pic.twitter.com/Wk8RTpLEl5
— Aakash Jhanjhari (@aakashjhanjhari) August 4, 2025