తెలంగాణ హైకోర్టులో సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ పిటిషన్ దాఖలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టులో తన పేరును తొలగించాలని ఆమె కోర్టును ఆశ్రయించారు.
RS Praveen: కాంగ్రెస్, బీజేపీ కలిసి కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను కుట్ర ప్రకారం కూల్చివేశాయని బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పేలుళ్ళు వెనుక రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉన్నారన్న అనుమానం ఉందన్నారు. మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటుకు కారణం బీజేపీ, కాంగ్రెస్ లే కారణమని ఆరోపించారు. రేవంత్, కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తో పాటు... వారి అనుచరుల ఫోన్ కాల్స్ టేడాను బయటకు…
CM Revanth Reddy : తెలంగాణలో అత్యంత చర్చనీయాంశంగా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కమిషన్ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ నివేదికను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశం అనంతరం ప్రకటించారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ, “కమిషన్ నివేదికలోని ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించాము. ఈ నివేదికను త్వరలోనే తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టి, అన్ని…
Harish Rao : తెలంగాణలో ప్రముఖ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ పునః ప్రారంభమైంది. ఈ విచారణలో భాగంగా సోమవారం మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు కమిషన్ ఎదుట హాజరుకానున్నారు. ఆయన గతంలో కేసీఆర్ కేబినెట్‌లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే. ఇంతకుముందు హరీష్ రావు, కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మేడిగడ్డ బ్యారేజీలో రెండు ఫిల్లర్లు…
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై జరుగుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ బహిరంగ విచారణ కొనసాగుతోంది. శనివారం, సీఈ సుధాకర్ రెడ్డి కమిషన్ ముందు హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల టెండర్లపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా, సుధాకర్ రెడ్డి తనిఖీలు లేకుండా మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి సబ్ స్టాన్షియల్ పత్రం ఇచ్చినట్లు అంగీకరించారు. డీపీఆర్ ప్రకారం కాఫర్ డ్యామ్‌కు డబ్బులు కేటాయించినట్లు వివరించారు. మేడిగడ్డ డిజైన్ ఖరారు చేసే సమయంలో ఎల్ అండ్ టీని సంప్రదించినట్లు చెప్పారు.…