KCR-Harish Rao : కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌పై ఏర్పాటైన జస్టిస్ ఎల్.నరసింహ ఘోష్ కమిషన్ నివేదికను మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, మాజీ మంత్రి హరీష్‌రావు హైకోర్టులో సవాల్ చేశారు. ఇద్దరూ వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసి కమిషన్ నివేదికను రద్దు చేయాలని, దానిపై అమలు చర్యలను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. పిటిషన్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతో కమిషన్‌ను ఏర్పాటు చేసిందని, నివేదికలో వాస్తవాలను వక్రీకరించి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ముద్దాయిగా చూపించే ప్రయత్నం చేసిందని కేసీఆర్, హరీష్‌రావు ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం కోరుకున్న విధంగానే కమిషన్ తుది నివేదిక ఇచ్చిందని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. కమిషన్ నివేదిక ఆధారంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే తదుపరి చర్యలను నిలిపివేయాలని, హైకోర్టు తక్షణం స్టే ఇవ్వాలని కేసీఆర్, హరీష్‌రావు తమ పిటిషన్లలో విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం, ఖర్చులు, సాంకేతిక లోపాలపై ఇప్పటికే రాజకీయ వివాదం కొనసాగుతోంది. జస్టిస్ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ నివేదికలో అనేక అవకతవకలు జరిగాయని పేర్కొంది.