MP Arvind Slams Kavitha: జాగృతి అధ్యక్షురాలు కవిత పై ఎంపీ అరవింద్ ఫైర్ అయ్యారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో కవిత నడుస్తోందని ఆరోపించారు. అసలు కవిత ఎవరు..? జాగృతి ఎంటి..? అని ప్రశ్నించారు. కవిత వేధింపుల భయానికి గతంలో కాంట్రాక్టర్లు పారిపోయారన్నారు. జాగృతి జనం బాట యాత్ర తీహార్ జైలుకు వెళ్తుందని.. మూడు నాలుగు సంవత్సరాల తర్వాత కవిత అనుకున్న ఆశయం నెరవేరుతుందన్నారు.
అమెరికాలో ఉద్యోగం చేసిన కవితకు తెలంగాణ పౌరుషం లేదని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి అన్నారు. తమ లాంటి వారికి తెలంగాణ వాదం నేర్పించింది బీజేపీ అని.. తమకు కాకుండా ఇంకెవరికి తెలంగాణ పౌరుషం ఉంటది? అన్నారు. తమది హిందుగాళ్లు బొందు గాళ్లు అన్న రక్తం కాదని.. కవిత స్టేట్మెంట్ ఇచ్చే ముందు స్థాయి చూసుకోవాలని విమర్శించారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.
"లెటర్ టూ డాడి" అని కవిత రాసిన లేఖ ఒక ఓటీటీ ఫ్యామిలీ డ్రామా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. దాని టైటిల్ కాంగ్రెస్ వదిలిన బాణమని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్.. బీఆర్ఎస్ రెండు పార్టీలు విఫలం అయ్యాయన్నారు. అందుకే అవి రెండు కలిసి బిజెపిని బద్నాం చేసే కుట్రలకు తెరలేపాయని.. కుటుంబ పాలనకు బీజేపీ వ్యతిరేకం..అది గాంధీల కుటుంబం అయిన కల్వకుంట్ల కుటుంబం అయిన అని స్పష్టం చేశారు. వారి కుటుంబ సంక్షోభాలను…
హైదరాబాద్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సూచించారు. వీసా గడువు తీరిన చాలా మంది బంగ్లా, పాక్ దేశస్థులు హైదరాబాద్‌లో ఉన్నారన్నారు. వీరందరిని వెంటనే వెనక్కి పంపి వేయాలని డిమాండ్ చేశారు. వీరి ఏరివేతకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని సూచించారు. హైదరాబాద్ లో స్లీపర్ సెల్స్ ఉన్నారని గతంలో చాలా సందర్భాల్లో రుజువైందని.. స్లీపర్ సెల్స్ కు హైదరాబాద్ ఎంపీ మద్దతు ఉందని ఆరోపించారు.
కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య. మల్లన్న సాగర్ ను సీఎం కేసీఆర్ ప్రజలకు కాకుండా కల్వకుంట్ల కుటుంబానికి అంకితం చేశారన్నారు. మసిపూసి మారెడు కాయ చందంగా కేసీఆర్ వ్యవహరించారు. కాళేశ్వరం నుంచి వర్షాకాలంలో మల్లన్న సాగర్ కు చుక్క రాదు. కాళేశ్వరం నుంచి మల్లన్న సాగర్ కు నీళ్లు రావడానికి ఎన్ని రోజులు పడతాయి. ఒక టూరిజం స్పాట్ కోసం లక్ష కోట్ల రూపాయల ఖర్చు చేశారు.…