బిజెపి పార్లమెంట్ ప్రవాస యోజన లో భాగంగా హైదరబాద్ పార్లమెంట్ పరిధిలో కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింథియా పర్యటన కొనసాగుతుంది. నేడు, రేపు నియోజక వర్గంలో పలు కార్యక్రమాల్లో సింథియా పాల్గొననున్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు, లబ్ధిదారులు, మేధావులతో జ్యోతిరాధిత్య సింథియా సమావేశం^ కానున్నారు. ఈ సందర్భంగా ఆయన మూడు రోజుల పాటు తాజ్ ఫలక్‌నామలో ఆయన బస చేసారు. అయితే నేడు 11 గంటలకు హైదరాబాద్ పార్లమెంట్ కోర్ కమిటి సమావేశ అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ జిల్లా పార్టీ పదాధికారుల సమావేశం కొనసాగనుంది. ఇక 12. 45కి మీడియా సమావేశం ఉంటుంది.
read also: Samantha: చైతూతో ఉన్న ఇంటిని డబుల్ రేటుకు కొనుగోలు చేసిన సమంత.. కారణం ఇదేనా?
2 గంటలకు గౌలిపురా ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో జరిగే సమావేశంలో సింథియా పాల్గొననున్నారు. సాయంత్రం 5 గంటలకు భాగ్యలక్ష్మి దేవాలయానికి కేంద్రమంత్రి వెళ్లనున్నారు. సాయంత్రం 6 గంటలకు రాజస్థాన్ భవన్ లో ఐటీ, సోషల్ మీడియాతో సింథియా సమావేశం కానున్నారు. రేపు (శనివారం) ఉదయం 7 జిల్లాల మోర్చాల అధ్యక్షులతో సింథియా సమావేశం జరుగనుంది. ఆరోజే ఉదయం 11 గంటలకు కార్వాన్ లో మొదటి సారి ఓటు వేయనున్న యువతతో సింథియా సమావేశం కానున్నారు.
lions Rates: పాకిస్తాన్ లో గేదెల కన్నా చీప్ గా సింహాల ధరలు.. ఎందుకంటే..