టాలీవుడ్ స్టార్ కపుల్ అక్కినేని నాగచైతన్య, సమంత గత ఏడాది అక్టోబర్‌లో విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అప్పటి నుంచి ఈ కపుల్‌కు సంబంధించి ఏ వార్త రాసినా హాట్ టాపిక్‌గానే మారుతోంది. కొందరు సమంత బిహేవియర్ కారణంగానే చైతూ విడాకులు తీసుకున్నాడని ప్రచారం చేయగా.. మరికొందరు సమంతకు చైతూ ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం లేదని.. చాలా నిబంధనలు పెడుతుండటం ఇష్టం లేకే అతడి నుంచి విడిపోయిందని ఆరోపణలు చేశారు. తాజాగా సమంతకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నాగచైతన్యతో కలిసి గతంలో తాను ఉన్న ఇంటిని సమంత రూ.కోట్లు ఖర్చు చేసి మరీ దక్కించుకుంది.
Read Also: Ramarao On Duty: రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ ట్విట్టర్ టాక్ ఏంటి?
వివరాల్లోకి వెళ్తే.. సమంత, నాగచైతన్య హైదరాబాద్‌లో ఎంతో ఇష్టపడి తమ ఇల్లు కొనుగోలు చేశారని.. వివాహం తర్వాత ఆ ఇంట్లోనే ఉన్నారని.. తర్వాత వారిద్దరూ కలిసి ఓ ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవడంతో వాళ్ళు ఉన్న ఇంటిని వేరే వాళ్ళకు అమ్మేశారని నటుడు మురళీమోహన్ ఓ ఇంటర్వూలో వెల్లడించారు. అయితే వారు కొనుక్కున్న ఇల్లు రీ మోడలింగ్ చేయించేంతవరకు పాత ఇంట్లోనే రెంట్‌కు ఉంటామని చెప్పడంతో సమంత వాళ్ల దగ్గర ఇల్లు కొనుక్కున్న వాళ్ళు అంగీకారం తెలిపారన్నారు. అయితే ఈ లోపే సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకుని విడిపోయారని… తర్వాత సొంత ఇంటి కోసం సమంత బయట చాలా వెతికింది కానీ ఆమెకు ఏ ఇల్లు నచ్చలేదని మురళీ మోహన్ వివరించారు. దీంతో మరోసారి సమంత తన దగ్గరకు వచ్చి అంతకు ముందు ఉన్న ఇల్లే తనకు కావాలని అడిగిందని మురళీ మోహన్ తెలిపారు. ‘నేను మీకు అమ్మాను, మీరు వేరేవారికి అమ్మారు కదా నేనేం చేయలేను’ అని మురళీ మోహన్ అనడంతో ఆ ఇల్లు కొన్నవాళ్లతో మాట్లాడి వారు కొన్న దానికంటే ఎక్కువ డబ్బులు ఇచ్చి మరీ చైతూతో కలిసి ఉన్న ఇంటిని సమంత మళ్ళీ కొనుగోలు చేసిందని మురళీమోహన్ తెలిపారు. ప్రస్తుతం సమంత ఆ ఇంట్లోనే తన తల్లితో కలిసి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.