లఖింపూర్ ఖేరి ఘటన.. సిట్‌ 5 వేల పేజీల చార్జ్‌షీట్‌

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.. నిరసన తెలుపుతున్న రైతులపై వాహనం దూసుకుపోగా, నలుగురు రైతులు సహా ఎనిమిదిమంది మృత్యువాతపడడం దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే.. అయితే, కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రానే వాహనంతో రైతులపైకి దూసుకెళ్లారనే ఆరోపణలు రావడం.. ఆ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సంచలన విషయాలు బయటపెట్టింది.. రైతులను చంపాలన్న పక్కా ప్రణాళికతోనే వాహనం నడిపారని సిట్ తన లేఖలో పేర్కొంది.. నిర్లక్ష్యం కారణంగా జరిగిన ఘటన కాదని.. రైతులను చంపేందుకు కుట్ర పన్నారని.. కేంద్రమంత్రి తనయుడు ఆశిష్ మిశ్రా సహా 13 మంది నిందితులపై హత్యాయత్నం అభియోగాలు నమోదు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కూడా సిట్‌ కోరింది.. ఇక, ఈ ఘటనలో 5 వేల పేజీలతో చార్జిషీట్‌ దాఖలు చేసింది సిట్..

Read Also: వైఎస్‌ షర్మిల సంచలన వ్యాఖ్యలు… ఏపీలోనూ కొత్త పార్టీ…!

లఖింపూర్ ఖేరి ఘటనలో ఇవాళ కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం.. మొత్తం 5000 వేల పేజీల్లో ఈ ఘటనకు సంబంధిచిన వ్యవహారాలను పేర్కొంది.. మొత్తం ఎనిమిది మంది మృతిచెందారు.. అందులో నలుగురు రైతులు, ఒక జర్నలిస్ట్, ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, మరొకరు ఉన్నారు.. ఇక, చార్జిషీట్‌లో మొత్తం 14 మంది పేర్లు నమోదు చేసింది సిట్‌.. జైలులో ఉన్న అశీష్ మిశ్రాను ప్రధాన నిందితుడిగా పేర్కొన్న సిట్… కేంద్రం మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు అశీష్ మిశ్రాయే ప్రధాని నిందితుడిగా తేల్చింది.. కొత్తగా వీరేంద్ర శుక్లా పేరును కూడా చార్జిషీట్‌లో చేర్చారు సిట్‌ అధికారులు.

Related Articles

Latest Articles