Jithender Reddy Says BRS Wont Win In Telangana Elections: పార్టీ పేరు మార్చుకున్నా, వాస్తు మార్చుకున్నా.. రాబోయే తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రాదని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి జోస్యం చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకటేనని.. ఆ రెండు పార్టీల చుట్టరికం ఎప్పటి నుంచో ఉందని పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గెలిచే నలుగురు ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు చెప్పాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరన్నారు. బండారు దత్తాత్రేయ తమ ఇంటికి వచ్చారని.. ఈటల రాజేందర్, విజయరామరావు తదితరులు వచ్చి, దత్తాత్రేయను కలిసి వెళ్లారని చెప్పారు. రేవంత్ రెడ్డి తనకు ఫోన్ చేశారని, తాను చేసిన ట్వీట్ చూసి బాగుందని చెప్పారని వెల్లడించారు.
Mouni Roy Photos: ఉల్లిపొర లాంటి గ్రీన్ శారీలో జిగేల్‌మనిపిస్తున్న మౌని రాయ్
ఇదే సమయంలో.. తనకు, ఈటలకు మధ్య ఎలాంటి విభేదాలూ లేవని జితేందర్ రెడ్డి స్పష్టం చేశారు. హుజూరాబాద్ ఉపఎన్నికల సమయంలో ఈటలతో కలిసి పని చేశానని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలోనూ ఈటలతో కలిసి పదేళ్లు పని చేశానని, ఆర్థికమంత్రిగా ఢిల్లీ వచ్చినప్పుడు ఈటల తన ఇంట్లోనే ఉండేవారని చెప్పారు. పార్టీ బలోపేతం కోసం ఈటలకు అదనపు బాధ్యతలు ఇస్తే సంతోషిస్తానని అన్నారు. ఈటలతో పాటు పార్టీ నేతలందరూ కలుస్తూనే ఉంటారని తెలిపారు. బీజేపీపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను ఆపాలని కోరారు. రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో తాను లేనని క్లారిటీ ఇచ్చారు. తాను మహబూబ్ నగర్ ప్రజల్లోనే ఉంటానన్నారు. తాను పార్టీ నిర్ణయాలకే కట్టుబడి ఉంటానని.. పార్టీ ఎక్కడ పోటీ చేయమంటే (ఎమ్మెల్యే, ఎంపి), తాను అక్కడ పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు.
Kishan Reddy: బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల DNA ఒకటే.. రెండూ కలిసి సంసారం చేశాయి
అలాగే.. బీజేపీపై ఖమ్మం సభలో రాహుల్ చేసిన వ్యాఖ్యల్ని జితేందర్ రెడ్డి ఖండించారు. బీఆర్ఎస్‌కు బీజేపీ ‘బీ-టీమ్’ కాదని.. 2004లో బీఆర్ఎస్‌తో బంధుత్వం ఎరువ పెట్టుకున్నారో రాహుల్ తెలుసుకోవాలని సూచించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పొంగులేటి చేరికతో.. వాపును చూసి కాంగ్రెస్ బలుపు అనుకుంటోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.