Jeevan Reddy : కేసీఆర్‌ను కలిసిన జీవన్ రెడ్డి..
- ఎర్రవెల్లిలో కేసీఆర్-జీవన్ రెడ్డి భేటీ హాట్ టాపిక్
- “దేవుడే పంపిండు” అంటూ జీవన్ రెడ్డి భావోద్వేగం
- బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించిన కేసీఆర్
- ఉత్తర తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాల సంకేతాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాజకీయాల్లో దశాబ్దాల అనుభవం ఉన్న ఇద్దరు దిగ్గజ నేతలు.. ఒకరు ఉద్యమ నాయకుడు కేసీఆర్, మరొకరు రైతు పక్షపాతి జీవన్ రెడ్డి. సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఇద్దరు నేతలు ఒక్కటవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. శుక్రవారం నాడు ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు , పార్టీ ముఖ్య నేతలు ఘనస్వాగతం పలికారు. కేసీఆర్ నివాసంలోకి అడుగుపెట్టిన జీవన్ రెడ్డిని చూడగానే గులాబీ అధినేత సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు.
“అన్నా.. తెలంగాణకు నష్టం జరుగుతున్న ఈ సమయంలో మీతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకే మీతో కలిసి పని చేయమని ఆ దేవుడే నన్ను మీ దగ్గరికి పంపిండు. చాలా గ్యాప్ తర్వాత ఇన్నాల్లకైనా మీతో కలిసి పనిచేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది అన్నా..” అంటూ మనసులోని మాటను వ్యక్తం చేస్తూ కళ్లవెంట నీళ్లు పెట్టుకున్నారు. దీంతో కేసీఆర్ వెంటనే ఆయనను అనునయిస్తూ, అప్యాయంగా దగ్గరకు తీసుకుని హృదయపూర్వక ఆలింగనం చేసుకున్నారు. అనంతరం జీవన్ రెడ్డిని దుశ్శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందించి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
Also Read
- Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
- Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
- Mephedrone Seized : బీబీనగర్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
- DGP Anand : నక్సలిజం పోయింది.. ఇప్పుడు డేంజర్ ఇదే.. డీజీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
Jananayagan Leaks: ‘జననాయగన్’ లీక్‌పై మెగాస్టార్ ఆగ్రహం: “అది ఒకరి కల.. దాన్ని నీరుగార్చకండి!”
ఈ భేటీలో కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే డా. కె. సంజయ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జీవన్ రెడ్డి వెంట ఆయన కుమారులు, జగిత్యాల మాజీ జడ్పీ చైర్ పర్సన్ వసంత సురేశ్ దంపతులు కూడా ఉన్నారు. కాసేపు ఇష్టాగోష్టిగా మాట్లాడుకున్న అనంతరం, కేసీఆర్ స్వయంగా జీవన్ రెడ్డి బృందానికి మధ్యాహ్న భోజన ఆతిథ్యం ఇచ్చారు.
Jananayagan : ‘జననాయగన్’ సినిమాను సోషల్ మీడియాలో షేర్ చేస్తే చట్టపరమైన చర్యలు..
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉండి, తెలంగాణ తనానికి దర్పణంగా నిలిచే జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరడం, కేసీఆర్‌ను “అన్నా” అని సంబోధిస్తూ భావోద్వేగానికి లోనవ్వడం చూస్తుంటే.. రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవించబోతున్నాయని స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఈ చేరిక ఒక పెద్ద ఊతమివ్వనుంది.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!