బీసీలను గత ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తనను, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును అన్యాయంగా జైలులో పెట్టారని మండిపడ్డారు. గత ప్రభుత్వం తప్పిదం వలన అన్ని ఆగిపోయాయని విమర్శించారు. త్వరలో నాగబాబు మంత్రి వర్గంలోకి వస్తారని, ఇక మార్పులు ఉండకపోవచ్చని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నంలో రైస్ పుల్లింగ్ జరిగిందని, తప్పు చేయకపోతే పేర్ని నాని ఎందుకు భయపడుతున్నారు? అని ప్రశ్నించారు.
కాకినాడలో ఎన్టీవీతో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ… ‘బీసీలను గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. నన్ను, అచ్చెన్నాయుడును అన్యాయంగా జైలులో పెట్టారు. గత ప్రభుత్వంలో మత్స్యకారులకి రావాల్సిన సబ్సిడీ నిధులు దారి మళ్లించారు. గత ప్రభుత్వం తప్పిదం వలన అన్ని ఆగిపోయాయి. దేశంలో అత్యధిక పింఛన్ ఇస్తున్న రాష్ట్రం ఏపీ. త్వరలో నాగబాబు మంత్రి వర్గంలోకి వస్తారు. నాకు తెలిసి ఇక మార్పులు ఉండకపోవచ్చు. మచిలీపట్నంలో రైస్ పుల్లింగ్ జరిగింది. తప్పు చేయకపోతే పేర్ని నాని ఎందుకు భయపడుతున్నారు. కోర్టుకి వెళ్లాల్సిన అవసరం ఏమి ఉంది. మీ (పేర్ని నాని) మేనేజర్ మీకు తెలియకుండా చేశాడా?. కేసుపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది’ అని అన్నారు.