రాష్ట్ర బిజెపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన జమున హేచరీస్ కు హైకోర్టులో ఊరట లభించింది. అయితే.. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట గ్రామంలోని ప్రభుత్వ భూమిని ఈ సంస్థ ఆక్రమించుకుందని రెవెన్యూ అధికారులు నిర్దారించి స్వాధీనానికి చర్యలు తీసుకున్నారు. ఈనేపథ్యంలో..దీనిపై జమునా హేచరీస్ హైకోర్ట్ ను ఆశ్రయించగా సర్వే నెంబర్ 130లోని జమునా హేచరీస్ కు చెందిన మూడెకరాల భూమి విషయంలో ఆగస్ట్ 1వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అధికారులను ఆదేశిస్తూ హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Earthquake: చైనాలో మళ్లీ భూకంపం.. రెండు రోజుల్లో రెండో భూకంపం
అయితే.. అచ్చంపేటలో మూడెకరాల ప్రభుత్వ భూమిని జమునా హేచరీస్ సంస్థ ఆక్రమించుకుందని రెవెన్యూ అధికారులు నిర్ధారణకు రావడంతో.. ఇటీవల మాసాయిపేట తహసీల్దార్ జమునా హేచరీస్ కు నోటీసులు జారీ చేసారు. కాగా.. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడంతో వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే.. దీనిపై జమునా హేచరీస్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో.. జమునా హేచరీస్ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం జమునా హేచరీస్ కు ఊరటనిచ్చేలా మధ్యంతర ఉత్తర్వులివ్వడమే.. అలాగే భూముల స్వాధీనానికి సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి.. మెదక్ కలెక్టర్.. ఆర్డివో.. మాసాయిపేట తహసీల్దార్ లను న్యాయస్ధానం ఆదేశించింది.
అయితే.. ఇటీవల జమునా హేచరీస్ ఆక్రమించుకున్నట్లు పేర్కొంటున్న అసైన్డ్ భూములను తిరిగి లబ్దిదారులకు పంపిణీ చేసారు అధికారులు. మాసాయిపేట మండలం హకీంపేట 97 సర్వేనంబర్ లో ఎకరం, అచ్చంపేట పరిధిలోని 84ఎకరాల 19 గుంటల భూమిని జమునా హేచరీస్ ఆక్రమించుకున్నట్లు అధికారులు నిర్దారించారు. కాగా.. ఈ భూములను ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి తిరిగి రైతులను అందచేసిన విషయం తెలిసిందే..