Hyderabad: పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద కత్తితో బిల్డర్ హల్చల్.. బౌన్సర్లపై దాడికి యత్నం!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసం వద్ద ఒక బిల్డర్ కత్తితో వీరంగం సృష్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మంలోని గణేశ్ టౌన్‌షిప్‌కు చెందిన బిల్డర్ భట్టు సుచేతన్ ఠాకూర్ నాయక్ ఈ ఘటనకు పాల్పడ్డాడు. జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 35లో ఉన్న పవన్ కళ్యాణ్ నివాసం వద్దకు చేరుకున్న అతను పవన్ కళ్యాణ్‌కు కలవనివ్వాలంటూ ఓ ఫ్లెక్సీ పట్టుకుని పట్టుబట్టాడు. పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు తాను గత 16 రోజులుగా పడుతున్న కష్టాలను ఆ ఫ్లెక్సీపై వివరించిన సుచేతన్ ఠాకూర్ నాయక్, తన సమస్యను నేరుగా చెప్పుకోవడానికి కొన్ని నిమిషాలు సమయం కేటాయించాలని పేర్కొన్నాడు. తాను తీవ్రమైన అప్పుల ఊబిలో కూరుకుపోయానని, వాటిని తీర్చేందుకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం అందించాలని చెబుతున్నాడు.
అయితే, అక్కడ విధుల్లో ఉన్న బౌన్సర్లతో వాగ్వాదానికి దిగిన బిల్డర్ భట్టు, తన వద్ద ఉన్న కత్తితో వారిని బెదిరిస్తూ దాడికి యత్నించాడు. అంతటితో ఆగకుండా తన ఛాతీ, చేతులపై కత్తితో కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన బౌన్సర్లు చాకచక్యంగా వ్యవహరించి అతడి చేతిలోని కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సుచేతన్ ఠాకూర్ నాయక్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతడి కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, వారి సమక్షంలో సుచేతన్కు నచ్చజెప్పి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం అతడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Also Read
- Cyclone Akvan: అక్వాన్ తీవ్ర తుపాన్ తీరం దాటే ప్రక్రియ ప్రారంభం.. వణుకుతున్న ఉత్తరాంధ్ర.. కీలక హెచ్చరిక!
- Devuthani Ekadashi 2026: నేడు దేవుని ఉత్థాన ఏకాదశి.. ఈ 5 తప్పులు చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందట..!
- TDP ZP Chairman and Vice Chairman Candidates List: టీడీపీ జడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ అభ్యర్థుల పూర్తి జాబితా ఇదే..!
- Andhra Pradesh: జడ్పీ పీఠాల పంపకం పూర్తి.. ఎవరికి ఏ జిల్లా పీఠం అంటే..?
తాజావార్తలు
-
Hyderabad: పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద కత్తితో బిల్డర్ హల్చల్.. బౌన్సర్లపై దాడికి యత్నం!!
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
PUC New Rules 2026: కారు, బైక్ యజమానులకు గుడ్ న్యూస్.. ఇక 3 ఏళ్ల వరకు PUC రెన్యువల్ అవసరం లేదు!
-
Cyclone Akvan: అక్వాన్ తీవ్ర తుపాన్ తీరం దాటే ప్రక్రియ ప్రారంభం.. వణుకుతున్న ఉత్తరాంధ్ర.. కీలక హెచ్చరిక!
-
Home Decor Ideas: పాత ప్లాస్టిక్ కుర్చీలను పనికిరావని పడేస్తున్నారా? ఇలా చేస్తే అస్సలు పడేయరు!
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!