CM Revanth Reddy: అవసరమైతే కేసీఆర్‌ను కూడా కలుస్తా.. సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ ప్రతి పేదవాడు అభివృద్ధి చెందాలని భావించారని, దేశ తొలి ప్రధాని నెహ్రూ విద్య, సాగునీటి రంగాలకు ప్రాధాన్యత ఇచ్చి అనేక విద్యా సంస్థలు, ప్రాజెక్టులు నిర్మించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ పార్టీయేనని, పీవీ నరసింహారావు లిబరలైజేషన్ పాలసీని తీసుకువస్తే మన్మోహన్ సింగ్ వాటిని కొనసాగించారని తెలిపారు. కానీ, మోడీ ప్రధాని అయ్యాక ఈడీ, సీబీఐ, ఇన్కమ్ ట్యాక్స్ సంస్థలను ముందుకు తీసుకువచ్చారని, జాతి, మతం, భాష పేరుతో విభేదాలు సృష్టించారని ఆరోపించారు. 12 ఏళ్లలో మోడీ పెట్టిన భయాన్ని యువత 12 రోజుల్లో తీసివేసిందని అన్నారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న పేదల ఓటు హక్కును తొలగించడానికి మోడీ ప్రయత్నిస్తున్నారని, రాహుల్ గాంధీ చేపట్టిన ‘ఓట్ చోర్.. గద్దీ చోర్’ నినాదానికి అందరి మద్దతు లభిస్తోందని పేర్కొన్నారు.
ప్రధాని మోడీ ఎన్నిసార్లు విదేశాలకు వెళ్లారో లెక్క లేదని, ఆయన ‘విజిటింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా’గా మారారని ఎద్దేవా చేశారు. మోడీకి ముందున్న ప్రధాన మంత్రులు రూ. 53 లక్షల కోట్ల అప్పు చేస్తే, ఈ 12 ఏళ్లలో ప్రధాని మోడీ ఏకంగా రూ. 120 లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు. మోడీ ప్రభుత్వ నిధులన్నీ అదానీ జేబులో వేస్తుంటే, తాను అదానీ జేబులో నుంచి నిధులు తీసుకువచ్చి తెలంగాణలో అభివృద్ధి చేస్తున్నానని, యువతకు ఉపాధి కల్పిస్తున్నానని చెప్పారు. అదానీ ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి ఎలా వచ్చారని ప్రశ్నించారు. బీజేపీ ఎప్పుడూ అబద్ధాలే మాట్లాడుతుందని, స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని, ప్రజలు ఉన్నన్ని రోజులు, మరో వెయ్యి ఏళ్లు కాంగ్రెస్ ఉంటుందని స్పష్టం చేశారు.
Also Read
- Tadipatri Violence: తాడిపత్రిలో రణరంగం.. కేతిరెడ్డి ఇంటిపై రాళ్ల దాడి! ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం! వాహనాలకు నిప్పు!
- BJP MLA Adinarayana Reddy: కూటమిలో జడ్పీ పీఠం చిచ్చు.. రాజీనామాకు ఎమ్మెల్యే సహా 20 మంది కౌన్సిలర్లు, 17 మంది ఎంపీటీసీలు రెడీ..?
- Chanakya Niti: ఈ 5 రకాల మనుషులతో జాగ్రత్త.. చాణక్య నీతి హెచ్చరిక..
- Tamil Nadu vs AP: తమిళనాడు రహస్యాలు ఏపీకి లీక్? విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం.. 15 మంది ఉద్యోగులపై వేటు!
ప్రభుత్వ అవసరాల కోసం ఎవరినైనా కలుస్తానని, అవసరమైతే కేసీఆర్‌ను కూడా కలుస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రధాని మోడీ ఎవరికీ చెప్పకుండా పాకిస్థాన్‌కు వెళ్లి బిర్యానీ తిని వచ్చారని, అలాంటప్పుడు తాను వెళ్లి మోడీని కలిస్తే తప్పేమిటని ప్రశ్నించారు. 8,000 మంది క్రీడాకారులు పాల్గొనే ‘ఖేలో ఇండియా’ కార్యక్రమం కోసం ప్రధానిని కలిసి ఆహ్వానించామని, డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో జరిగే ‘తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’కు రావాలా లేదా అన్నది మోడీ ఇష్టమని, తాను తన మర్యాద చూపించానని అన్నారు. తన ప్రస్థానం ఏబీవీపీ నుంచే ప్రారంభమైందని.. అది తాను దాచిపెట్టడం లేదని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అయితే ఈ దేశానికి రాహుల్ గాంధీ అవసరం ఉన్నందునే కాంగ్రెస్ వైపు వెళ్లానని చెప్పారు.
తెలంగాణలో బీజేపీ పాత్ర లేదని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలోనే బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదని విమర్శించారు. అమిత్ షాకు ధైర్యం ఉంటే హైదరాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేసి అసదుద్దీన్ ఒవైసీని ఓడించాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నేతల గురించి మాట్లాడుతూ.. కేటీఆర్‌ను తాను అంత సీరియస్‌గా తీసుకోనని, ఆయనది మేనేజ్మెంట్ కోటా అని విమర్శించారు. తండ్రిని అడ్డం పెట్టుకుని నాయకుడయ్యారని, ఆయన పేరు ఎత్తడం కూడా తనకు ఇష్టం లేదని అన్నారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను మాత్రమే పోటీ నేతగా భావిస్తానని, తన కథలో కేసీఆర్ రావణాసురుడని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం ఉండాలి కాబట్టి ఆ పార్టీని కొనసాగిస్తున్నామని, లేకుంటే ఎప్పుడో ఖాళీ చేసేవాళ్లమని అన్నారు. పార్టీ ఫిరాయింపులను కేసీఆర్ ప్రారంభించారని, ఇప్పుడు అదే ఆయన్ను చుట్టుకుందని విమర్శించారు. నిన్ననే సిద్ధిపేటకు వెళ్లి కాంగ్రెస్ జెండాను ఎగరవేసి వచ్చామని తెలిపారు.
తాజావార్తలు
-
Chiranjeevi Letter: మెగాస్టార్ చిరంజీవి లేఖ.. అమిత్ షాకు అందజేసిన కిషన్ రెడ్డి!
-
CM Revanth Reddy: అవసరమైతే కేసీఆర్‌ను కూడా కలుస్తా.. సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Tadipatri Violence: తాడిపత్రిలో రణరంగం.. కేతిరెడ్డి ఇంటిపై రాళ్ల దాడి! ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం! వాహనాలకు నిప్పు!
-
CM Yogi Adityanath: సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు మాతృవియోగం.. 91 ఏళ్ల వయసులో తల్లి కన్నుమూత
-
BJP MLA Adinarayana Reddy: కూటమిలో జడ్పీ పీఠం చిచ్చు.. రాజీనామాకు ఎమ్మెల్యే సహా 20 మంది కౌన్సిలర్లు, 17 మంది ఎంపీటీసీలు రెడీ..?
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!