ఇండియా మోటార్ స్పోర్ట్స్ రేసింగ్ హిస్టరీలో సరికొత్త అధ్యాయానికి హైదరాబాద్ వేదిక అయింది. నిన్న మెరుపు వేగంలో దూసుకెళ్తున్న కార్లు.. సరికొత్త సందడితో రేసింగ్ పోటీలు హైదరాబాద్ వాసుల్ని ఉర్రూతలూగించాయి. ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ రేసింగ్ లీగ్ అట్టహాసంగా ప్రారంభమైంది.