Gold Rate Today: బంగారం కొనాలనుకునే వారు త్వరపడకపోతే మంచి అవకాశం మిస్ అవుతారు. వరుసగా భారీగా పెరుగుకుంటూ పెరిగిన ధరలు ఒక్క సారిగా తగ్గాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దీని ప్రభావంతో మళ్లీ ధరలు దూసుకెళ్లే అవకాశం ఉంది. అందుకే త్వరగా కొనుగోలు దారులు పసిడిని కొనుక్కోవాలని విశ్లేషకులు చెబుతున్నారు.
Read Also: Director Passed Away : ఇండస్ట్రీని వీడని విషాదాలు.. ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత
అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం రికార్డు గరిష్టాలను తాకి.. ప్రస్తుతం తగ్గుతున్నాయి. అక్కడ స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1750 డాలర్లకుపైగా ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ ధర ఔన్సుకు 21 డాలర్ల వద్ద ఉంది. రూపాయి మాత్రం కాస్త మెరుగైంది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.66 వద్ద కొనసాగుతోంది. తాజాగా పసిడి ధరలు దిగొచ్చాయి. ఇవాళ తులం బంగారంపై రూ.150, కిలో వెండిపై రూ.300 వరకు ధర తగ్గింది. ప్రస్తుతం దేశంలో తులం గోల్డ్ రూ.53,020 వద్ద కొనసాగుతోంది. అలాగే కిలో వెండి రూ.65,500కు లభిస్తోంది.
Read Also: Youth Marries Dead Girlfriend : ప్రేమంటే ఇదేరా.. ప్రేయసి శవాన్ని పెళ్లి చేసుకున్నాడు
నవంబర్ 19న హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర.. రూ.48 వేల 600ఉంది. ఇక 24 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర హైదరాబాద్‌లో రూ. 160 పతనమై రూ.53,020 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికి వస్తే హైదరాబాద్‌లో కిలో వెండి ఏకంగా రూ.500 పెరిగింది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.48,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,020 వద్ద కొనసాగుతోంది. విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,020గా ఉంది.అంతకుముందు రెండు రోజుల్లో రూ.1500 మేర తగ్గడం గమనార్హం.