కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులపై మాజీ మేయర్ రవీందర్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో నాణ్యతకు నిబంధనలకు నీళ్లు వదిలారు.. స్మార్ట్ సిటీ పనుల నిర్వహణకు, ప్రభుత్వానికి సంబంధం ఉండదు.. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయాలు తీసుకుంటారు.
సివిల్ సప్లై కార్పొరేషన్ ఛైర్మన్‌గా రవీందర్ సింగ్ పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. తనకు ఇంతటి కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఋణపడి ఉంటానని రవీందర్ సింగ్ అన్నారు.
ఒకప్పుడు ఆ ఇద్దరు నేతల మధ్య విభేదాలు పార్టీని ఇబ్బందుల్లో పడేశాయ్. ఇది తట్టుకోలేని ఆ నేత పార్టీలోంచి జంప్ అయ్యారు. ఇప్పుడు తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఐతే…గతంలో విభేదించిన నేతతోనే మళ్లీ పని చేయాల్సి రావటం ఆయనకు మింగుడుపడటం లేదు. ఇద్దరి మధ్యా రాజీ కుదిర్చేందుకు ఏకంగా అధినేత జోక్యం చేసుకోవాల్సింది. ఇంతకీ…ఆ ఇద్దరు కీలక నేతల మధ్య సయోధ్య కుదిరినట్లేనా? తిరిగి పార్టీలోకి వచ్చినా…రవీందర్ సింగ్ సొంతంగానే కార్యక్రమాలు కరీంనగర్ జిల్లా బిఆర్‌యస్‌లో…
ఆయనేమో మంత్రి.. ఇంకొకరు మాజీ మేయర్. రాజకీయంగా ఇద్దరి మధ్య పాత పగలు ఉన్నాయట. అవి కొత్తగా సెగలు పుట్టిస్తాయేమోనని డౌట్. అందుకే అందరి దృష్టీ ఆ ఇద్దరిపైనే ఉంది. ఎవరా నాయకులు? ఏంటా వివాదం? రవీందర్ సింగ్ రీఎంట్రీ.. వాడీవేడీ చర్చ..!కరీంనగర్ టీఆర్‌ఎస్ రాజకీయాల్లో సెగలు రాజుకుంటున్నాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉందన్నది అధికారపార్టీ వర్గాల మాట. ఇందుకు మంత్రి గంగుల కమలాకర్, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్‌సింగ్ మధ్య నెలకొన్న…
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరన్న నానుడి మరోసారి రుజువైందా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెబల్‌గా బరిలో దిగిన మాజీ మేయర్ ఘర్‌వాపసీ అవుతున్నారా? రవీందర్ సింగ్ మనసు మార్చుకున్నారా? తెరవెనక ఏం జరిగింది? టీఆర్ఎస్‌లోకి రవీందర్‌సింగ్ ఘర్‌వాపసీ..!రవీంద్ సింగ్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ రెబల్‌గా బరిలో నిల్చొని ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చారు. ఆ ఎన్నికల్లో ఓడినా.. గణనీయంగానే ఓట్లు సాధించారు. ఉద్యమకాలం నుంచి టీఆర్‌ఎస్‌ను అంటిపెట్టుకుని ఉన్న ఈ మాజీ…
కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ మళ్లీ సొంతగూటికి చేరనున్నారు. ఈ మేరకు గురువారం నాడు హైదరాబాద్ ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను మాజీ మేయర్ రవీందర్ సింగ్ కలిశారు. కరీంనగర్ జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక సంస్థలలో నెలకొన్న సమస్యలు, సిక్కు సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఈ సమస్యలను పరిష్కరిస్తామని రవీందర్ సింగ్‌కు కేసీఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. Read…
రాజన్న సిరిసిల్లా జిల్లాలో మాజీ మేయర్, కరీంనగర్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ ఆదివారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ పార్టీపై మంత్రి కేటీఆర్ పై విమర్శల దాడులకు దిగారు. సిరిసిల్ల మునిగిపోతుంటే మంత్రిగా కేటీఆర్ ఏం చేస్తున్నారు. మీరు కేవలం ఐటీమంత్రిగానే పనిచేస్తారు… మీరు మున్సిపల్ మంత్రిగా పనికిరారు. 500 సెక్షన్లు ఉన్న మున్సిపల్ చట్టాన్ని 200 సెక్షన్లుగా మార్చి.. కౌన్సిలర్లను, కార్పోరేటర్లను ఉత్సవ విగ్రహాలుగా మార్చిన ఘనత…
ఉద్యమ ద్రోహులకు కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నాడని స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ ఆరోపించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్యమకారులను కేసీఆర్ చిన్నచూపు చూస్తున్నారన్నారు. తాను ఉద్యమకారుల అండతోనే పోటీలో ఉన్నాని తెలిపారు. ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఆత్మగౌరవాన్ని కాపాడడానికే నేను బరోలో ఉన్నాని రవీందర్ సింగ్ తెలిపారు. 12 ఏళ్లలో ఏనాడైనా ఎంపీటీసీలకు భాను ప్రసాద్ ఫోన్ చేశాడా అని ప్రశ్నించారు. క్యాంపు రాజకీయాలతో, నోట్ల…