ఉమ్మడి కరీంనగర్‌లో భారీగా పెరగనున్న భూముల రిజిస్ట్రేషన్ విలువ నేటి నుంచి పెరిగిన కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. మార్కెట్ విలువ అమాంతం పెంచడంతో ప్రజల పై దాదాపుగా 40కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం కరీంనగర్ పట్టణంలోని మార్కెట్ ఏరియాలో గజానికి 32,500 ఉంటే ఇప్పుడు 37,400 అయ్యింది. మార్కెట్ ధరలు పెరగడంతో రిజిస్ట్రేషన్ ఫీజు సైతం గణనీయంగా పెరుగుతుంది.గతంతో పోలిస్తే ఇప్పుడు లక్షల్లో తేడా వస్తుంది. పెరిగిన రిజిస్ట్రేషన్…
317 జీవో రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. స్థానిక ప్రాతిపదికన బదిలీలు చేపట్టాలన్నారు.శాశ్వతంగా 124 జీవో,317జీవోను రద్దు చేయాలన్నారు. స్థానిక ఉద్యోగాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందని, 371 డి ఇప్పటికి అమలులో ఉందని గుర్తు చేశారు. 371జీవోను సవరణ చేసే అధికారం ఎవ్వరికి…
సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు. కరీంనగర్ లో బెయిల్ పై విడుదల అయిన మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ఇంటికి వెళ్ళి ఆమెను పరామర్శించారు ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. మీడియా పై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేసి, థర్డ్ డిగ్రీ ప్రయోగించి భయపెడుతున్నారని మండిపడ్డారు. జిల్లాల సంఖ్య పది నుంచి 33కి, జోన్లు రెండు నుంచి ఏడుగా మార్చారని ఫైర్ అయ్యారు. రాష్ట్రపతి సవరణ చేసి…
బీజేపీ నాయకురాలు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభకు హై కోర్టులో ఊరట లభించింది. బొడిగె శోభను రూ. 25 వేల పూచీకత్తుతో విడుదల చేయాలని పోలీసులను తెలంగాణ రాష్ట్ర హై కోర్టు ఆదేశించింది. అయితే ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉద్యోగుల బదీలీ విషయంలో ఉన్న జీవో నెంబర్ 317 ను సవరించాలని జాగరణ దీక్ష చేపట్టారు. అయితే ఈ దీక్షలో బండి సంజయ్, బొడిగె శోభతో సహా మొత్తం 17 మందిని…
ఉద్యోగ బదీలీల అంశంపై జాగరణకు పిలుపునిచ్చిన బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ తన క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతుండగా మైకుల్ని, కెమెరాలను లాగిన పోలీసులు వారి తీరుపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ..నీ కొడుకు వేల మందితో ర్యాలీలు తీస్తే కోవిడ్ నిబంధనలు ఎటు పోయాయి.అధికార అహంకారంతో కేసీఆర్‌కు కళ్లు నెత్తికెక్కాయన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి పోయే రోజులు దగ్గర పడ్డాయన్నారు. కేసీఆర్ ….నీ అవినీతి సామ్రాజ్యాన్ని బద్దలు…
ఆ జిల్లాలోని ముఖ్య నేతలంతా కేరాఫ్ హైదరాబాద్. అధికార, ప్రతిపక్ష పార్టీలనే తేడా లేదు. అందరు నాయకులదీ అదే తీరు. ప్రజాక్షేత్రంలో ఉండాల్సిన నేతలు.. స్థానిక ప్రజలకు దూరంగా ఉంటున్నారట. దీంతో ప్రజలకు.. వాళ్లు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు మధ్య గ్యాప్ వస్తుందని టాక్. ఇంతకీ ఏంటా జిల్లా? నాయకులు ఎందుకు జిల్లాలో ఉండటం లేదు? రెండేళ్లుగా ప్రజలకు దూరంగా ప్రజాప్రతినిధులు..! ఉమ్మడి కరీంనగర్ జిల్లా. రాజకీయ చైతన్యం ఎక్కువే. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నుంచి కాకలు తీరిన…
తెలంగాణలోని ఐదు జిల్లాల పరిధిలో ఆరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరుగుతుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. కరీంనగర్‌లో రెండు, ఆదిలాబాద్, నల్గొండ, మెదక్, ఖమ్మం జిల్లాలో ఒక్కో స్థానానికి గానూ మొత్తం 26 మంది పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాలో ఏర్పాటు చేసిన 37 పోలింగ్ కేంద్రాల్లో 5,326 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని పోలింగ్…
కరీంనగర్‌లో కరోనా కలకలం కొనసాగుతుంది. బొమ్మకల్‌లోని చల్మెడ మెడికల్ కాలేజీలో విద్యార్థులకు, స్టాఫ్‌కు మొత్తం 49 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కాలేజీలో మొత్తం 1000 మంది ఉండగా, మరో 100 మంది విద్యార్థుల శాంపిల్స్‌ను టెస్టులకు వైద్య సిబ్బంది పంపించారు. 49 మందికి పాజిటివ్ రావడంతో ఒక్కసారిగా కళాశాల యాజమాన్యం ఆందోళనలో ఉంది. దీంతో కళాశాలకు యాజమాన్యం సెలవు ప్రకటించింది. కరోనా కేసులు పెరగడంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం వెంటనే వైద్య ఆరోగ్య శాఖను…
రాజన్న సిరిసిల్లా జిల్లాలో మాజీ మేయర్, కరీంనగర్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ ఆదివారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ పార్టీపై మంత్రి కేటీఆర్ పై విమర్శల దాడులకు దిగారు. సిరిసిల్ల మునిగిపోతుంటే మంత్రిగా కేటీఆర్ ఏం చేస్తున్నారు. మీరు కేవలం ఐటీమంత్రిగానే పనిచేస్తారు… మీరు మున్సిపల్ మంత్రిగా పనికిరారు. 500 సెక్షన్లు ఉన్న మున్సిపల్ చట్టాన్ని 200 సెక్షన్లుగా మార్చి.. కౌన్సిలర్లను, కార్పోరేటర్లను ఉత్సవ విగ్రహాలుగా మార్చిన ఘనత…
ఉద్యమ ద్రోహులకు కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నాడని స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ ఆరోపించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్యమకారులను కేసీఆర్ చిన్నచూపు చూస్తున్నారన్నారు. తాను ఉద్యమకారుల అండతోనే పోటీలో ఉన్నాని తెలిపారు. ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఆత్మగౌరవాన్ని కాపాడడానికే నేను బరోలో ఉన్నాని రవీందర్ సింగ్ తెలిపారు. 12 ఏళ్లలో ఏనాడైనా ఎంపీటీసీలకు భాను ప్రసాద్ ఫోన్ చేశాడా అని ప్రశ్నించారు. క్యాంపు రాజకీయాలతో, నోట్ల…