ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలవడంతో మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్‌జిల్లాలో ఎస్ ఆర్‌ఆర్ కాలేజీలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు.అపవిత్ర పొత్తుతో ఉన్న అభ్యర్థికి ఓటర్లు మద్దతు ఇవ్వలేదన్నారు. కేసీఆర్ బలపర్చిన భానుప్రసాద్, ఎల్. రమణలకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి మంత్రి గంగుల కృతజ్ఞతలు తెలిపారు. ఏకగ్రీవం కావాల్సిన స్థానాలను ఎన్నికల వరకు తీసుకెళ్లారన్నారు. 1324 ఓట్లలో 1063 ఓట్లు టీఆర్‌ఎస్‌కు పడ్డాయన్నారు. ఇతర పార్టీల ఓట్లు 324 ఉండగా…
ఉద్యమ ద్రోహులకు కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నాడని స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ ఆరోపించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్యమకారులను కేసీఆర్ చిన్నచూపు చూస్తున్నారన్నారు. తాను ఉద్యమకారుల అండతోనే పోటీలో ఉన్నాని తెలిపారు. ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఆత్మగౌరవాన్ని కాపాడడానికే నేను బరోలో ఉన్నాని రవీందర్ సింగ్ తెలిపారు. 12 ఏళ్లలో ఏనాడైనా ఎంపీటీసీలకు భాను ప్రసాద్ ఫోన్ చేశాడా అని ప్రశ్నించారు. క్యాంపు రాజకీయాలతో, నోట్ల…