Bathukamma: బతుకమ్మ అంటే ప్రకృతి పండుగ.. పువ్వుల్లాంటి ఆడబిడ్డలు ప్రకృతి ఒడిలో పూసిన పూలతో చేసుకునే సంబురం బతుకమ్మ పండుగ. ప్రకృతిని అరాధించే అతి పెద్ద పండుగ బతుకమ్మ పండుగ. తెలంగాణ సమాజం సంబరంగా జరుపుకునే పండుగల్లో ప్రముకమైనది బతుకమ్మ పండుగ. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలైన పండుగ, సద్దుల బతుకమ్మతో ముగిస్తుంది ఈ పండుగ. బతుకమ్మ పండుగను భాద్రపదమాస అమావాస్య నుంచి మొదలై తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది. సద్దుల బతుకమ్మ పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది. తెలంగాణలో రేపటి నుంచి బతుకమ్మ సంబురాలు ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డలు పూల పండుగతో సందడి చేయనున్నారు. ఇంతకీ ఈ తొమ్మిది రోజుల పాటు నైవేద్యాలు ఏమేమి పెడుతారో తెలుసా…
READ ALSO: Charlapally Murder Case: చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో డెడ్‌బాడీ కలకలం.. వీడిన మిస్టరీ..!
పండుగ ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభం అవుతుంది. ఈ రోజు నువ్వులు, బియ్యంపిండి, నూకలు నైవేద్యంగా పెడుతారు.
అటుకుల బతుకమ్మ – సప్పిడి పప్పు, బెల్లం, అటుకులు
ముద్దపప్పు బతుకమ్మ – ముద్దపప్పు, పాలు, బెల్లం
నానబియ్యం బతుకమ్మ – నానేసిన బియ్యం, పాలు, బెల్లం
అట్ల బతుకమ్మ – అట్లు, దోసెలు
అలిగిన బతుకమ్మ – నైవేద్యం ఉండదు
వేపకాయల బతుకమ్మ – బియ్యంపిండి వేయించి వేపపండ్లుగా తయారు చేసి పెడతారు
వెన్నముద్దల బతుకమ్మ – నువ్వులు, నెయ్యి, బెల్లం
సద్దుల బతుకమ్మ – ఐదురకాల నైవేద్యాలు పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ అన్నం, కొబ్బరన్నం, నువ్వులన్నం నైవేద్యాలుగా పెడుతారు.
ఈ పండుగ సందర్భంగా బంధువులు, చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడమే కాకుండా, కష్టసుఖాలూ పంచుకునే వేదిక బతుకమ్మ సంబరాలు జరుగుతాయి. ఎక్కడెక్కడో ఉన్న ఆడపడుచులు పండుగ సందర్భంగా తల్లిగారింటికి వస్తుంటారు. ఈ పండుగ రోజుల్లో తెలంగాణ ఆడబిడ్డలందరి ముఖాల్లో కొత్తకాంతులు కనిపిస్తాయి. చిన్నా పెద్ద మహిళలంతా పట్టుచీరలు, పరికిణీలు, లంగా ఓణీలను ధరించి, పూలతో పేర్చిన బతుకమ్మలను ఎత్తుకొని ఎత్తుకుని వీధుల గుండా సామూహికంగా నడిచే అద్భుత దృశ్యం తెలంగాణలో మాత్రమే కనిపిస్తుంది. మట్టిని గౌరవించడం, పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని వయసుల మహిళలు కలిసి ఆటపాటలు పాడటం ఒక్క బతుకమ్మ పండుగ సందర్భంలోనే కనిపిస్తుంది. అందుకే దీన్ని మట్టి పండుగ అని, మహిళల పండుగ అని పిలుస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే బతుకమ్మ నీళ్లునిండుగా ఉండి, ఎటు చూసినా పచ్చగా ఉండే ఈ రోజుల్లోనే ఎందుకు వస్తుందో ఇలాంటి దృశ్యాలు చూసినప్పుడే అర్థం అవుతుంది.
READ ALSO: Nail Health Signs: మీ గోర్లు చెప్పే హెల్త్ సీక్రెట్స్.. రంగును బట్టి వచ్చే రోగాలు ఇవే!