YS Viveka Case : వివేకా హత్య కేసు.. సీబీఐ కోర్టు సంచలన తీర్పు
- వివేకా హత్య కేసులో లోతైన దర్యాప్తు పిటిషన్‌పై తీర్పు వెల్లడించిన సీబీఐ కోర్టు
- సునీత పిటిషన్‌ను షరతులతో అనుమతించిన సీబీఐ కోర్టు
- సునీత వాదనలతో ఏకీభవించిన సీబీఐ కోర్టు
- కేసులో తదుపరి దర్యాప్తు చేయాలని సీబీఐకి కోర్టు ఆదేశం
- లోతైన దర్యాప్తునకు కోర్టు ఆదేశిస్తే విచారణ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని గతంలో కోర్టుకు తెలిపిన సీబీఐ
- ఈ కేసులో కాల్ రికార్డుల ఆధారంగా దర్యాప్తు చేయాలని ఆదేశం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరింత లోతైన దర్యాప్తు అవసరమని సీబీఐ కోర్టు గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు చేపట్టాలని సీబీఐకి కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వివేకా కుమార్తె వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్లో చేసిన వాదనలతో కోర్టు ఏకీభవిస్తూ, కొన్ని షరతులతో ఆమె అభ్యర్థనకు అనుమతి తెలిపింది. వివేకా హత్య కేసులో కోర్టు ఆదేశిస్తే అదనపు దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నామని సీబీఐ గతంలోనే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సునీత అభ్యర్థనకు మద్దతుగా, ఈ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ కూడా సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసినదే.
ఈ హత్య కేసులో సమగ్ర దర్యాప్తు జరగలేదని, అనేక అంశాల్లో దర్యాప్తు అసంపూర్తిగా ఉందని నిందితులు చెబుతున్న అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సునీత కోర్టుకు విన్నవించారు. వివేకా హత్యపై పూర్తి నిజాలు వెలుగులోకి రావాలంటే మరోసారి లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై డిసెంబర్ 6వ తేదీన వాదనలు పూర్తయ్యాయి. అనంతరం తీర్పును ఈ నెల 10వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. ఈ సందర్భంగా సునీత తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా, న్యాయవాది ఎస్. గౌతం కోర్టులో తమ వాదనలు వినిపించారు. అన్ని వాదనలు పరిశీలించిన అనంతరం, సునీత పిటిషన్‌ను సమర్థించిన కోర్టు.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో లోతైన దర్యాప్తు కొనసాగించాలని సీబీఐకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
- Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
Actor Nandu – singer Geetha: తన ప్రపోజల్ సీక్రెట్ బయటపెట్టిన స్టార్ సింగర్..
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!