YS Jagan: వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానిని ఫోన్లో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. నానికి గుండె సంబంధిత సమస్యలున్నాయని నిర్ధారించిన ఏఐజీ వైద్యులు.. వైద్య పరీక్షల్లో గుండె సంబంధిత సమస్యలున్నట్టు, మూడు వాల్వ్స్ బ్లాక్ అయినట్టు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. త్వరలోనే ఆపరేషన్ కూడా చేయాల్సి ఉంటుందని నాని కుటుంబ సభ్యులకు ఏఐజీ డాక్టర్లు సమాచారం ఇచ్చారు.
Read Also: CM Chandrababu: జగన్ సర్కార్ నిర్లక్ష్యంతో వందల కోట్ల ప్రజాధానం వృథా అయింది..
ఇక, డాక్టర్లతో మాట్లాడి కొడాలి నాని అనారోగ్యంపై వాకబు చేసి ధైర్యంగా ఉండాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బంధువులు, సన్నిహితులు, కార్యకర్తలు ఆందోళనకు గురవుతారనే ఉద్దేశంతో నాని ఆరోగ్యంపై ముందుగా వెల్లడించని వైసీపీ నేతలు.. అయితే, నిన్న కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పిరావడంతో హైదరాబాద్ లోని కొండాపూర్ గల ఏఐజీ ఆసుపత్రిలో అతడ్ని జాయిన్ చేశారు. ప్రస్తుతం ఏఐజీ ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో కొడాలి నాని చికిత్స పొందుతున్నారు.