* నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రివర్గం భేటీ.. పలు కీలక అంశాలపై చర్చించనున్న ఏపీ కేబినెట్.. పలు సంస్థలకు భూ-కేటాయింపులు చేసే అవకాశం..
* నేడు పలువురు కేంద్రమంత్రులతో డిప్యూటీ సీఎం పవన్ సమావేశం.. అమిత్ షాతో పాటు పలువురు కేంద్రమంత్రులతో భేటీ..
* నేడు భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ నేతలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ భేటీ.. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశం కానున్న జగన్.. హాజరు కానున్న స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు.. ప్రజా సమస్యలు, రాజకీయ పరిణామాలపై చర్చించనున్న వైఎస్ జగన్..
* నేడు విశాఖలోని జీవీఎంసీ కమిషనర్ ను కలవనున్న వైసీపీ.. గీతం కాలేజీకి భూముల కేటాయింపును వ్యతిరేకిస్తున్న వైసీపీ.. గీతం కాలేజీకి భూముల క్రమబద్ధీకరణ అంశాన్ని కౌన్సిల్ అజెండాలో పెట్టిన జీవీఎంసీ అధికారులు.. అజెండా నుంచి భూముల అంశాన్ని తొలగించాలని వైసీపీ డిమాండ్..
* నేడు తూర్పు గోదావరి జిల్లాలో రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ రాజమండ్రిలో పర్యటన.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆర్ అండ్ బీ అతిథి గృహంలో అర్జీల స్వీకరణ.. అనంతరం కలెక్టరేట్ లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం..
* నేటి నుంచి నుంచి సీడబ్ల్యూసీ నెంబర్ రఘువీరారెడ్డి పాదయాత్ర.. తన స్వగ్రామం నీలకంఠాపురం నుంచి హిందూపురం వరకు పాదయాత్ర.. మూడు రోజుల పాటు కొనసాగనున్న పాదయాత్ర.. రాజకీయాలకు అతీతంగా పాదయాత్ర ఉంటుందన్న రఘువీరారెడ్డి.. గాంధీ సిద్ధాంతాలు యువతకు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే పాదయాత్ర.. దేశ సమైక్యత, విలువలు చాటే విధంగా పాదయాత్ర.. ఇందులో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్న రఘువీరారెడ్డి..
* నేడు విశాఖలో జైళ్ల శాఖ జాతీయ స్థాయి సమావేశం.. 9వ నేషనల్ కాన్ఫరెన్స్ కు ముఖ్య అతిథిగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్.. హాజరు కానున్న అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల జైళ్ల శాఖ ముఖ్య అధికారులు..
* నేడు మాచవరం మండలం పిన్నెల్లిలో ఎస్సీ కమిషన్ సభ్యులు పర్యటన.. వైసీపీ కార్యకర్త సాల్మన్ మృతిపై ఐదుగురు సభ్యుల బృందం విచారణ..
* నేడు అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దివ్య కళ్యాణం.. అంత రాత్రి గం. 1. 56 నిమిషాలకు స్వామివారి కల్యాణానికి 6 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా.. కళ్యాణ మహోత్సవం సందర్భంగా భారీ ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు.. భక్తుల కోసం ఉభయ గోదావరి జిల్లా నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు.. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీస్ బందోబస్తు..
* నేటి నుంచి మేడారం జాతర ప్రారంభం.. నాలుగు రోజుల పాటు జరగనున్న జాతర.. ఈరోజు కన్నెపల్లి నుంచి గద్దెకు రానున్న సారలమ్మ.. రేపు చిలకలగుట్ట నుంచి గద్దెపైకి రానున్న సమ్మక్క..
* నేడు పటాన్ చెరులో ముగ్గురు మంత్రుల పర్యటన.. ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కు శంకుస్థాపన.. పాల్గొననున్న మంత్రులు పొంగులేటి, దామోదార, వివేక్..
* నేడు మెదక్ జిల్లాలో మీనాక్షి, మహేష్ గౌడ్ పర్యటన.. కొర్విపల్లిలో కూలీలతో భేటీకానున్న నేతలు.. ఉపాధి హామీ చట్ట సవరణపై నిరసన తెలపనున్న నేతలు..
* నేటి నుంచి తెలంగాణలో ఈ నెల 30వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ.. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు.. ఫిబ్రవరి 11న పోలింగ్.. 13న కౌంటింగ్..
* నేడు బీఆర్ఎస్ లోకి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్.. వరంగల్ నుంచి హైదరాబాద్ కు భారీ ర్యాలీ.. సాయంత్రం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ లో చేరిక..
* నేడు హైదరాబాద్ లో వెంగ్స్ ఇండియా-2026 ప్రారంభం.. ప్రారంభించనున్న కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్.. కార్యక్రమంలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. 4 రోజుల పాటు కనువిందు చేయనున్న విమానాలు.. చివరి రెండు రోజులు సాధారణ ప్రజలకు అనుమతి..
* నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి..
* నేడు కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో కీలక సమావేశం.. హాజరుకానున్న ప్రతిపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్లు.. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ..
* నేటి మధ్యాహ్నం 3: 30 గంటలకు ఢిల్లీలో NCC ర్యాలీ.. NCC ర్యాలీలో పాల్గొననున్న ప్రధాని మోడీ..
* నేడు బెంగాల్ లో బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ పర్యటన.. అసెంబ్లీ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో ముఖ్యఅతిథిగా హాజరుకానున్న నితిన్ నబీన్..
* నేడు వీధి కుక్కల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ..
* నేడు భారత్- న్యూజిలాండ్ మధ్య నాలుగో టీ20 మ్యాచ్.. రాత్రి 7 గంటలకు విశాఖలోని ఏసీఏ- వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్..