V.C. Sajjanar: ఆన్ లైన్ బెట్టింగ్ ల కూపంలో పడొద్దని టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. అరచేతిలో వైకుంఠం చూపించడం అంటే బహుశా ఇదే కాబోలు..అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ యువతను అలర్ట్ చేశారు. ఈ టక్కుటమారా మాటలతో అమాయకులను ఆన్ లైన్ బెట్టింగ్ కూపంలోకి లాగుతున్నారని మండిపడ్డారు. తమ స్వలాభం కోసం ఎంతో మందిని జూదానికి వ్యసనపరులను చేస్తూ.. వారి ప్రాణాలను తీస్తోన్న వీళ్లంతా సంఘవిద్రోహ శక్తులే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Hyderabad: చార్మినార్ వద్ద గంజాయి బ్యాచ్ హల్ చల్.. నడిరోడ్డు పై కట్టెలతో దాడి..
యువకుల్లారా!! ఈజీగా మనీ సంపాదించాలనే ఆశతో ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల మాయమాటల్లో పడకండి అని సూచించారు. బంగారు జీవితాలను నాశనం చేసుకోకండి అని తెలిపారు. జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి షార్ట్ కట్స్ ఉండవు.. మీ కష్టాన్ని నమ్ముకోండి. విజయం దానంతట అదే మీ దరికి చేరుతుందని తెలిపారు. జీవితంలో ఎదగాలంటే ఇలాంటి బెట్టింగులకు అలవాటు పడవద్దని తెలిపారు. బెట్టింగులు వ్యసనంగా మారి అప్పుల ఊబిలో పడొద్దని సూచించారు. సజ్జనార్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచనలంగా మారింది. ఈ వీడియో చూసిన వారంతా వామ్మో అంటూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇప్పటికైనా యువత మేలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.
Read also: Mulugu: ఆ గ్రామానికి అరిష్టం పట్టింది.. జంగాలపల్లిలో వరుస మరణాల కలకలం..
అరచేతిలో వైకుంఠం చూపించడం అంటే బహుశా ఇదే కాబోలు..!!
ఈ టక్కుటమారా మాటలతో అమాయకులను ఆన్ లైన్ బెట్టింగ్ కూపంలోకి లాగుతున్నారు.
తమ స్వలాభం కోసం ఎంతో మందిని జూదానికి వ్యసనపరులను చేస్తూ.. వారి ప్రాణాలను తీస్తోన్న వీళ్లంతా సంఘవిద్రోహ శక్తులే.
యువకుల్లారా!! ఈజీగా మ… pic.twitter.com/XO282rDTff
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) November 18, 2024
IT Rides: హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడులు.. ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలో తనిఖీలు