Mulugu: పచ్చని చెట్లు, పంట పొలాలతో కళకళలాడుతున్న ములుగు జిల్లా జంగాలపల్లిలో వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. రెండు నెలల్లోనే 30 మంది మృతి చెందడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. జ్వరం వచ్చిన మూడు, నాలుగు రోజుల్లోనే కొందరు మృత్యువాత పడ్డటంతో గ్రామంలో కలకలం మొదలైంది. మృతులంతా 25 నుంచి 50 ఏళ్లు లోపు వారే కావడంతో గ్రామస్తులు పలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి అరిష్టం పట్టిందని కొందరి వాదనలు ఉండగా.. మరికొందరు బొడ్రాయి వార్షికోత్సవ వేడుకలు జరపకపోవడంతోనే అని అంటున్నారు. ఇంకొందరు అంతుచిక్కని మరణాలు సంభవిస్తున్నాయని వాదిస్తున్నారు. దయ్యాలు శక్తులే గ్రామస్తుల ప్రాణాలు తీస్తున్నాయని గ్రామస్తుల్లో భయం పట్టుకుంది.
జంగాలపల్లి గ్రామంలో మెడిక్ క్యాంపు ఏర్పాటు చేయాలని స్థానికుల డిమాండ్ చేస్తున్నారు. వెయ్యి గడపలున్న ఊర్లో మృత్యుఘోష జరగడం ఇదే మొదటి సారి అని ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 30 మంది మృతి చెందడంతో గ్రామంలో భయాందోళన వాతావరణం నెలకుంది. గ్రామంలో దుష్టశక్తులు పట్టి పీడుస్తున్నాయనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఎవరికైనా జ్వరం వచ్చిందంటే చాలు ఇక వారు మృత్యువుకు దగ్గరయ్యానే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో చుట్టుపక్కల గ్రామస్తులు ఆ గ్రామానికి వెళ్లాలంటేనే భయంతో జంకుతున్నారు. అధికారులు స్పందించి జంగాలపల్లిలో మెడిక్ క్యాంపు ఏర్పాటు చేయాలని వేడుకుంటున్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
IT Rides: హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడులు.. ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలో తనిఖీలు