ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ (iBOMMA) నిర్వాహకుడు రవి కేసులో తాజాగా సీఐడీ (CID) రంగంలోకి దిగింది. పైరసీ సినిమాలు అందిస్తూనే, చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినట్లు రవిపై ఆరోపణలు ఉన్నాయి. ఈరోజు పోలీసులు రవిని మూడో రోజు కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు. మొదటి రెండు రోజులు విచారణలో రవి సరిగా సహకరించలేదని సమాచారం. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసింది డబ్బుల కోసమే అని రవి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. రవికి సంబంధించిన ఖాతాల వివరాలు అందించాలని…
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. ఐదు గంటలపాటు సుధీర్గంగా ప్రకాశ్‌రాజ్ స్టేట్ మెంట్‌ను ఈడీ రికార్డ్ చేసింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బెట్టింగ్ యాప్స్ పై ప్రచారం వ్యవహారంలో నిర్వాహకులు నుంచి తనకు డబ్బులు అందలేదని ప్రకాశ్‌రాజ్ స్పష్టం చేశారు.. ఇకనుంచి బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేయనని తెలిపారు..
V.C. Sajjanar: ఆన్ లైన్ బెట్టింగ్ ల కూపంలో పడొద్దని టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. అరచేతిలో వైకుంఠం చూపించడం అంటే బహుశా ఇదే కాబోలు..అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ యువతను అలర్ట్ చేశారు. ఈ టక్కుటమారా మాటలతో అమాయకులను ఆన్ లైన్ బెట్టింగ్ కూపంలోకి లాగుతున్నారని మండిపడ్డారు. తమ స్వలాభం కోసం ఎంతో మందిని జూదానికి వ్యసనపరులను చేస్తూ.. వారి ప్రాణాలను…