TET Exams: తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి టెట్ పరీక్షలు ప్రారంభమై.. జూన్ 30వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలు రెండు షిఫ్టులలో ఆన్లైన్ పద్దతిలో నిర్వహించబడతాయి. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు జరగనుండగా.. రెండవ షిఫ్ట్ మధ్యాహ్నం 2:00 నుంచి 4:30 గంటల వరకు కొనసాగనుంది. సుమారు తొమ్మిది రోజుల పాటు 16 సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. 15 జిల్లాల్లో 66 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, మహబూబ్నగర్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే, ఈ పరీక్షలకు 1, 83, 653 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు.
Read Also: Nagarjuna : విలన్ పాత్రల్లో నాగార్జున.. రాంగ్ రూట్ ఎంచుకున్నాడా..?
అభ్యర్థులకు సూచనలు:
* టెట్ పరీక్షలు రాసే అభ్యర్థులు హాల్ టికెట్లు అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి..
* జూన్ 18 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి..
* పరీక్షకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, ఇతర వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను సంప్రదించండి.
* పరీక్షలు రాసే అభ్యర్థులు గంట ముందే ఎగ్జామ్ సెంటర్ కు చేరుకోవాలి..
* స్మార్ట్ వాచీలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పరీక్షా కేంద్రంలోకి అనుమతించబడవు..
* హాల్ టికెట్స్ మీద ఒరిజినల్ కలర్ ఫోటోను మాత్రమే అతికించాలి..
* హాల్ టికెట్ తో పాటు ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ లాంటివి వెంట తీసుకెళ్లండి..