Jowar Sangati Recipe: తింటే ప్రాణం లేచి రావాల్సిందే! ముద్ద పప్పు లేదా నాటుకోడి పులుసుతో ‘జొన్న సంగటి’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jowar Sangati Recipe: నేటి కాలంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి, షుగర్ (Diabetes) వ్యాధితో బాధపడేవారికి చిరుధాన్యాలు ఒక వరంగా చెప్పవచ్చు. రాయలసీమ స్పెషల్ రాగి సంగటి గురించి మనందరికీ తెలుసు. కానీ అంతే రుచికరంగా, అంతకంటే ఎక్కువ బలనిచ్చే ‘జొన్న సంగటి’ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
Also Read
- Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
కావలసిన పదార్థాలు:
జొన్న రవ్వ: 1 కప్పు (మరీ సన్నగా కాకుండా, కొంచెం పలకగా ఉన్నది)
బియ్యం: 1/4 కప్పు (సంగటి మెత్తగా రావడం కోసం)
నీళ్లు: 4 నుండి 5 కప్పులు (రవ్వ రకాన్ని బట్టి)
ఉప్పు: రుచికి సరిపడా
నెయ్యి: కొద్దిగా (రుచి కోసం)
తయారీ విధానం:
ముందుగా జొన్న రవ్వను, బియ్యాన్ని శుభ్రంగా కడిగి కనీసం 30 నిమిషాల నుండి గంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల సంగటి త్వరగా ఉడుకుతుంది. ముందుగా ఒక మందపాటి గిన్నెలో లేదా కుక్కర్‌లో 4 కప్పుల నీటిని పోసి, అందులో రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మరిగించాలి. అలా నీళ్లు మరుగుతున్నప్పుడు నానబెట్టిన బియ్యం మరియు జొన్న రవ్వను వేయాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, అడుగు అంటకుండా మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి.
ఇలా చేస్తున్నపుడు రవ్వ, బియ్యం పూర్తిగా ఉడికి నీరంతా ఇంకిపోయి మెత్తగా అయిన తర్వాత.. పప్పు గుత్తితో గానీ లేదా గరిటెతో గానీ బాగా ఎనుపుకొవాలి. దీనివల్ల సంగటి ముద్దలాగా బాగా వస్తుంది. ఆ తర్వాత చేతికి కొంచెం నీరు లేదా నెయ్యి రాసుకుని, వేడిగా ఉన్నప్పుడే మీకు నచ్చిన పరిమాణంలో ముద్దలుగా చుట్టుకోవాలి. అంతే జొన్న సంగటిని వేడివేడిగా ఏదైనా నాటు కోడి పులుసు లేదా వేరుశనగ పప్పుల చట్నీ (పల్లీ చట్నీ) తో తింటే అద్భుతంగా ఉంటుంది. పైన కొంచెం నెయ్యి వేసుకుంటే ఆ రుచే వేరు.
ఆరోగ్య ప్రయోజనాలు:
జొన్నల్లో పీచు పదార్థం (Fiber) ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా ఆకలి వేయదు, ఇది బరువు తగ్గడానికి దోహదపడుతుంది. ఇంకా దీని గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అలాగే ఇందులో ఉండే క్యాల్షియం మరియు మెగ్నీషియం ఎముకల పుష్టికి ఎంతో మేలు చేస్తాయి.
తాజావార్తలు
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
-
Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
-
IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
-
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
-
Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!