TG TET 2025 : తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ గురువారం ఈ ప్రకటన చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం నవంబర్ 15వ తేదీ నుంచి అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు తుది గడువు నవంబర్ 29గా నిర్ణయించారు. జనవరి 3 నుంచి 31వ తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు…
Teacher Eligibility Test: దేశవ్యాప్తంగా 6–14 సంవత్సరాల పిల్లలకు విద్యనందిస్తున్న అన్ని పాఠశాలల్లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) తప్పనిసరి చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) పరిధికి రిఫర్ చేసింది. దేశంలోని అన్ని విద్యాసంస్థల్లో టెట్ పూర్తి చేసిన వాళ్లే ఉపాధ్యాయులుగా ఉండాలని, ఏ విద్యా సంస్థకు మినహాయింపు ఇవ్వొద్దని సుప్రీం కోర్టులో పిల్ దాఖలైంది. ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్న లా స్టూడెంట్ నితిన్ ఉపాధ్యాయ్ సుప్రీం కోర్టును…
TGTET 2025 : తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) జూన్ సెషన్ ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. మంగళవారం ఉదయం ఎడ్యుకేషన్ సెక్రటరీ యోగితా రాణా అధికారికంగా ఫలితాలను ప్రకటించారు. ఈ పరీక్షలో మొత్తం అభ్యర్థులలో 33.98 శాతం మాత్రమే అర్హత సాధించినట్లు వెల్లడించారు. ఈ సంవత్సరం టెట్ జూన్ సెషన్ పరీక్షలు జూన్ 18 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించబడ్డాయి. ప్రాథమిక ఫలితాలను ఇప్పటికే జూలై 5న ప్రకటించిన సంగతి తెలిసిందే. పేపర్…
TET Exams: తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి టెట్ పరీక్షలు ప్రారంభమై.. జూన్ 30వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలు రెండు షిఫ్టులలో ఆన్‌లైన్ పద్దతిలో నిర్వహించబడతాయి. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు జరగనుండగా.. రెండవ షిఫ్ట్ మధ్యాహ్నం 2:00 నుంచి 4:30 గంటల వరకు కొనసాగనుంది.
తెలంగాణ టెట్(ఉపాధ్యాయ అర్హత పరీక్ష) షెడ్యూల్‌ను పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ విడుదల చేశారు. సబ్జెక్టుల వారీగా షెడ్యూల్‌ను రిలీజ్ చేశారు. జనవరి 2 నుండి జనవరి 20వ తేదీ వరకు టెట్ పరీక్షలను నిర్వహించనున్నారు.
TG TET 2024: తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులకు అప్లికేషన్ లోని తప్పులను సవరిస్తేను అవకాశం కల్పించింది. టెట్ నోటిఫికేషన్ గతంలో విడుదల చేయగా, దరఖాస్తు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, అభ్యర్థులు తమ అప్లికేషన్లలో జరిగే తప్పులను సరిదిద్దుకునేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ కొత్త అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఈ నెల 16 నుంచి 22వ తేదీ…
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TS TET 2024) దరఖాస్తు గడువును ఈ నెల 20 వరకు పొడిగిస్తూ రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 11 నుండి 20 వరకు అప్లికేషన్ ఎడిట్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించింది.
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TS TET 2024) దరఖాస్తు గడువు నేటితో(ఏప్రిల్ 10) ముగియనుంది. మార్చి 27 నుంచి ప్రారంభమైన దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ ఈ సందర్భంగా పేర్కొంది.
తెలంగాణలో త్వరలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ను నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. టెట్ నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని ఆమె తెలిపారు. దీంతో త్వరలో టెట్ నిర్వహణకు చర్యలు తీసుకుంటామని మంత్రి సబిత వెల్లడించారు. అలాగే ఉద్యోగ అభ్యర్థుల కోసం ప్రతి యూనివర్సిటీ పరిధిలో ఫ్రీ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ల నియామకాలను సైతం త్వరలో చేపడతామన్నారు. మరోవైపు మన ఊరు మన బడి కార్యక్రమం కింద…