Air India: ఎయిర్ ఇండియాకు తప్పిన భారీ ప్రమాదం.. ఇంధన స్విచ్ ‘‘రన్’’ నుంచి ‘‘కట్ ఆఫ్’’కి మార్పు..
- ఎయిర్ ఇండియాకు తప్పిన భారీ ప్రమాదం..
- ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లలో సమస్య..
- రన్ నుంచి కట్ ఆఫ్‌కు మారిన వైనం..
- అహ్మదాబాద్ ప్రమాదంలో కూడా ఇదే పరిస్థితి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India: ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం ఇంధన స్విచ్‌లలో సాంకేతిక సమస్య తలెత్తిన నేపథ్యంలో దానిని గ్రౌండ్ చేశారు. ఇంజన్ స్టార్ట్ చేసే సమయంలో ఎడమ ఇంజన్‌కు సంబంధించిన ఇంధన స్విచ్ ‘‘రన్’’ పొజిషన్‌లో నిలువకుండా రెండుసలార్ ‘‘కట్ ఆఫ్’’కి మారిందని ఎయిర్ ఇండియా ప్రతినిధి చెప్పారు.
AI 132 ఫ్లైట్ లండన్ హిత్రో విమానాశ్రయం నుంచి బెంగళూర్ రావాల్సి ఉంది. పైలట్ లేవనెత్తిన సమస్యను అవ్యవసర ప్రాతిపదికన పరిశీలిస్తు్న్నామని ఎయిర్ ఇండియా చెప్పింది. ఈ అంశాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) తెలియజేశారు. ఇంతకుముందు, డీజీసీఏ ఆదేశాల మేరకు ఎయిర్ ఇండియా తన ఫ్లీట్‌లో ఉన్న అన్ని ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానాల్లో ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లను తనిఖీ చేయాలని ఆదేశించింది. ఆ సమయంలో లోపాలు లేవని సంస్థ వెల్లడించింది.
Also Read
- Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
- India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
- Ukarine War: ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, జిన్‌పింగ్ సాయం.. ట్రంప్‌కు షాకిస్తూ రష్యా కీలక ప్రకటన..
- Ivolga high-speed train: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..
జూలై 2025లో అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ ప్రమాదం తర్వాత ప్రాథమిక నివేదికలో టేక్ ఆఫ్ అయిన కొన్ని క్షణాల్లో ఇంజన్ల ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లు తాత్కాలికంగా ఆఫ్ చేయబడినట్లు, దీంతోనే ఇంజన్లకు అందాల్సిన శక్తి తగ్గిందని వెల్లడైంది. ఫలితంగా టేకాఫ్ అయిన క్షణాల్లోనే విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 260 మంది మరణించారు.
ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లు:
ఇంధన నియంత్రన స్విచ్‌లు విమాన ఇంజన్లకు ఇంధన సరఫరాను నియంత్రిస్తాయి. సాధారణంగా విమానం నేలపై ఉన్నప్పుడు ఇంజన్ స్టార్ట్ లేదా షట్‌డౌన్ చేయడానికి పనిచేస్తాయి. విమానంలో ఇంజన్ లోపం తలెత్తినప్పుడు మాన్యువల్‌గా ఆపడానికి లేదా మళ్లీ స్టార్ట్ చేయడానికి వీటిని ఉపయోగిస్తారు.
బోయింగ్ 787లోని రెండు ఫ్యూయల్ స్విచ్‌లు థ్రస్ట్ లివర్ కింద ఉంటాయి. రన్ నుంచి కట్ ఆఫ్‌కు మార్చాలంటే పైలట్ ముందుగా స్విచ్‌ను పైకి లాగి, ఆ తర్వాత దాని స్థానాన్ని మార్చాలి. అహ్మదాబాద్ ప్రమాదంలో టేకాఫ్ అయిన వెంటనే ఇంజన్ స్విచ్‌లు ఒక సెకన్ వ్యవధిలో వరసగా రన్ నుంచి కట్ఆఫ్‌గా మారినట్లు ఫ్లైట్ రికార్డర్ వెల్లడించింది. కాక్‌పిట్‌లో ఒక పైలట్ ‘‘నువ్వు ప్యూయల్ ఎందుకు కట్ చేశావు..?’’ అని అడగగా, మరొకరు ‘‘నేను చేయలేదు’’ అని సమాధానం ఇచ్చారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
-
India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
-
Ganesh Idol Protest: ‘వినాయకుడి’తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
-
New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
-
AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!