Nagarjuna : కింగ్ నాగార్జునకు మంచి మార్కెట్ ఉంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. తన ఇద్దరు కుమారుల కంటే ఆయన సినిమాలకే మంచి కలెక్షన్లు వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వయసు ఏ మాత్రం కనిపించకుండా మేనేజ్ చేస్తున్న నాగార్జున.. ఇప్పటి వరకు నెగెటివ్ రోల్స్ చేయలేదు. సొంతంగానే సినిమాలను నిర్మించుకోగలరు. అలాంటి నాగార్జునకు సడెన్ గా ఏమైంది. ఎందుకు విలన్ రోల్స్ చేస్తున్నాడు. హీరోగా మంచి సినిమాలు చేసుకునే నాగ్.. విలన్ పాత్రలపై ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అర్థం కావట్లేదు ఆయన అభిమానులకు.
Read Also : Kannappa : కన్నప్పకు సెన్సార్ అభ్యంతరాలు..?
లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రజినీకాంత్ హీరోగా వస్తున్న కూలీ సినిమాలో సైమన్ అనే విలన్ పాత్ర చేస్తున్నాడు. ఇప్పుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న కుబేర సినిమాలో నెగెటివ్ రోల్ చేస్తున్నాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు. ఆయనకు ఏం తక్కువ అంటున్నారు ఫ్యాన్స్. ఆయన ఫేడవుట్ అయిపోలేదు. మార్కెట్ పడిపోలేదు. అక్కినేని అభిమానుల సపోర్ట్ ఫుల్ గా ఉంది. టాలీవుడ్ ను శాసించిన కుటుంబాల్లో అక్కినేని కుటుంబం కూడా ఉంది. మరి నాగ్ కు ఏమైంది.
హీరోగా అవకాశాలు రావట్లేదా అంటే బోలెడన్ని ప్రాజెక్టులు రెడీగా ఉన్నాయి. కానీ విలన్ పాత్రల్లో చేయాలని నాగార్జున ఎందుకో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నటుడు అన్న తర్వత అన్ని పాత్రలు చేయాలనే కోరిక అందరికీ ఉంటుంది. ఆ కోరికను నెరవేర్చుకోవడానికే ఇలా చేస్తున్నారేమో అనిపిస్తోంది. కానీ ఇది ఆయన ఫ్యాన్స్ కు నచ్చడం లేదు. నాగార్జునను తాము విలన్ గా ఊహించుకోలేం అంటున్నారు. ఒకసారి ప్రేక్షకుల్లో విలన్ అనే ముద్ర పడితే.. మళ్లీ హీరోగా గత ఇమేజ్ ను పొందడం కష్టమే అవుతుంది. కాబట్టి నాగార్జున ఈ విషయాలను గుర్తుంచుకోవాలని కోరుతున్నారు అభిమానులు.
Read Also : Raja Saab – Peddi -War-2 : ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్.. ఎవరి సత్తా ఏమిటో?