Royal Enfield Himalayan 450 vs KTM 390 Adventure: ఆఫ్-రోడ్ అడ్వెంచర్‌లో బెస్ట్ ఏది.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Royal Enfield Himalayan 450 vs KTM 390 Adventure: నేటి యువతలో అడ్వెంచర్ రైడింగ్ పై ఆసక్తి రోజురోజుకీ భారీగా పెరుగుతోంది. హార్డ్‌కోర్ ఆఫ్‌రోడ్ రైడర్లను దృష్టిలో పెట్టుకుని KTM కంపెనీ కేటీఎం 390 అడ్వెంచర్ ఆర్ (KTM 390 Adventure R)ను లాంచ్ చేసింది. మరోవైపు ఇప్పటికే అడ్వెంచర్ రైడర్లలో పేరుగాంచిన రాయల్ ఎంఫిల్డ్ హిమాలయన్ 450 మన బ్లాక్ (Royal Enfield Himalayan 450 Mana Black) ఉంది. మరి ఈ రెండింటిలో నిజమైన అడ్వెంచర్ ఏదో పోల్చి చూద్దాం.
ఇంజిన్ (Engine):
కేటీఎం 390 అడ్వెంచర్ ఆర్ లో 399 cc లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 45.3 bhp పవర్, 39 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ ఫ్రీ-రేవింగ్ నేచర్, క్విక్ థ్రాటిల్ రెస్పాన్స్‌కి పేరుగాంచింది. హైవే అయినా, ఆఫ్‌రోడ్ అయినా – థ్రాటిల్ తిప్పగానే బైక్ ముందుకు దూసుకెళ్తుంది. ఇంకా హిమాలయన్ 450 మన బ్లాక్ లో 452 cc లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 39.4 bhp పవర్, 40 Nm టార్క్ ఇస్తుంది. పవర్ కొంచెం తక్కువగా ఉన్నా, ఎక్కువ టార్క్ కారణంగా లో-ఎండ్ గ్రంట్ బాగా ఫీల్ అవుతుంది. ముఖ్యంగా కఠినమైన ట్రెయిల్స్ లో ఇది అడ్వాంటేజ్ అవుతుంది.
Also Read
- Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
- EV Two-Wheeler Sales: భారత్ ఈవీ మార్కెట్లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!
- BMW i7 Facelift: సింగిల్ ఛార్జ్‌తో 728KM రేంజ్.. BMW i7 Facelift లాంచ్.. 31.3 ఇంచుల 8K థియేటర్ స్క్రీన్!
- Hero Glamour X 125: హీరో గ్లామర్ ఎక్స్ 125 కొత్త అప్డేట్తో లాంచ్.. రైడింగ్ మోడ్లతో పాటు క్రూయిజ్ కంట్రోల్, ABS!
TVS Raider 125: భారీగా పెరిగిన టీవీఎస్ రైడర్ 125 ధరలు.. ఏ వేరియంట్ ధర ఎంత పెరిగిందంటే?
సస్పెన్షన్ & బ్రేకింగ్ (Suspension & Braking):
KTMలో 20-స్టెప్ అడ్జస్టబుల్ WP Apex ఇన్వర్టెడ్ ఫ్రంట్ ఫోర్క్ ఉంటుంది. రైడర్ తన అవసరానికి తగ్గట్టుగా సెటప్ మార్చుకునే ఫ్రీడమ్ ఇక్కడ ఉంది. వెనుక మోనోషాక్ కూడా హార్డ్ ఆఫ్‌రోడ్‌లో మంచి కంట్రోల్ ఇస్తుంది. అలాగే హిమాలయన్ 450 మన బ్లాక్ లో షోవా ఇన్వర్టెడ్ ఫ్రంట్ ఫోర్క్ ఉంది. కానీ ఇది నాన్ అడ్జస్టబుల్. వెనుక మోనోషాక్ ఉన్నా, KTM లా ఫైన్ ట్యూనింగ్ అవకాశాలు లేవు. అయినప్పటికీ, దీని సెటప్ బలంగా ఉంటుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే.. KTM కి 320 mm ఫ్రంట్, 240 mm రియర్ డిస్క్ ఉన్నాయి. హిమాలయన్ లో 320 mm ఫ్రంట్, 270 mm రియర్ డిస్క్ ఉంది. రియర్ బ్రేక్ సైజ్‌లో హిమాలయన్ కి స్వల్ప ఆధిక్యం ఉంది. రెండింటిలో KTMకి పెద్ద బలం దాని సస్పెన్షన్.

వీల్స్ & గ్రౌండ్ క్లియరెన్స్ (Wheels & Ground Clearance):
రెండు బైక్‌ల్లోనూ 21-ఇంచ్ ఫ్రంట్ వీల్ ఉంది. KTM 390 అడ్వెంచర్ ఆర్ లో 18-ఇంచ్ ట్యూబ్ టైర్ రియర్ వీల్ ఉంటుంది. హిమాలయన్ 450 మన బ్లాక్ లో 17-ఇంచ్ ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్ వస్తుంది. లాంగ్ టూరింగ్‌లో పంక్చర్ సమస్యల విషయంలో ట్యూబ్‌లెస్ సెటప్ మరింత ప్రాక్టికల్ గా ఉండనుంది. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే KTM స్పష్టంగా ముందుంది. ఇందులో 272 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. అదే హిమాలయన్ లో ఇది 230 mm లోపే ఉంటుంది. ఇంకా బరువు విషయంలో కూడా KTMకి అడ్వాంటేజ్ ఉంది. KTM బరువు కేవలం 176 kg, అయితే హిమాలయన్ బరువు 195 kg. ఈ కారణంగానే టెక్నికల్ ట్రెయిల్స్‌లో KTM మరింత లైట్‌గా, కంట్రోల్డ్‌గా అనిపిస్తుంది.
ధర (Price):
KTM బైకు ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.78 లక్షలుగా ఉంది. మరోవైపు రాయల్ ఎంఫిల్డ్ హిమాలయన్ 450 మన బ్లాక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.37 లక్షలు. అంటే KTM కంటే సుమారు రూ. 41,000 తక్కువ. ఈ ధర తేడా చిన్నది కాదు.

మొత్తంగా చూస్తే, KTM 390 Adventure R హార్డ్‌కోర్ ఆఫ్‌రోడ్ రైడర్లకు సరైన ఎంపిక. తక్కువ బరువు, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, అడ్జస్టబుల్ సస్పెన్షన్ దీన్ని టెక్నికల్ ట్రెయిల్స్‌లో బెస్ట్‌గా నిలబెడతాయి. ఇక Royal Enfield Himalayan 450 Mana Black మాత్రం నమ్మకమైన టూరింగ్ అడ్వెంచర్ బైక్ గా చెప్పవచ్చు. మెరుగైన లో-ఎండ్ టార్క్, ట్యూబ్‌లెస్ వీల్స్‌తో లాంగ్ రైడ్స్‌కి ఇది మరింత ప్రాక్టికల్ అనుభవాన్ని ఇస్తుంది. ఫైనల్ గా హార్డ్‌కోర్ ఆఫ్‌రోడ్ కావాలంటే KTM, నమ్మకమైన అడ్వెంచర్ టూరింగ్ కావాలంటే రాయల్ ఎంఫిల్డ్ హిమాలయన్ బెస్ట్.
తాజావార్తలు
-
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
-
India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
-
Ganesh Idol Protest: ‘వినాయకుడి’తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
-
New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
-
AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!