Telangana CM: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. 90 టీఎంసీలు పట్టిసీమకు తీసుకెళ్లారు.. దాంట్లో మాకు 45 టీఎంసీలు రావాలని డిమాండ్ చేశారు. ఇక, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకి నీళ్ళ కేటాయింపులు కావాలి అంటే ఇవ్వడం లేదు.. ఏపీ ప్రభుత్వం అభ్యంతరం ఎందుకు చెప్తున్నారు అని ప్రశ్నించారు. మా ప్రాజెక్టులకు ఎన్ఓసీ ఇవ్వండి అన్నారు. నికర జలాల వాడుకుంటాం అంటే మీరు అభ్యంతరం చెప్తున్నారు.. వరద జలాల మీద మాత్రం మీరు మాపై కోట్లాడుతున్నారు అని పేర్కొన్నారు. చంద్రబాబు మేల్కొని.. తెలంగాణనీ ఇరకటంలోకి నెట్టిండు.. చంద్రబాబు వచ్చినా.. జగన్ వచ్చినా.. గోదావరి నీళ్లు తీసుకు పోతామన్నారు.. దీనికి కేంద్రం కూడా పరిష్కారం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా సార్లు మేము కిషన్ రెడ్డినీ అడిగాం.. అధికారులను పంపి వివరాలు ఇచ్చాం.. కానీ, కిషన్ రెడ్డి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీకి మనుగడ తేవాలని కిషన్ రెడ్డి చూస్తున్నారు.. అంతరించిపోతున్న బీఆర్ఎస్ కి పునరుజ్జీవం పోయాలని కిషన్ రెడ్డి చూస్తున్నారని సీఎం రేవంత్ తెలిపారు.
Read Also: CM Revanth Reddy: తెలంగాణకు శాపంగా మారిన బీఆర్ఎస్ నిర్ణయాలు..
అయితే, ప్రజలకు బీఆర్ఎస్, బీజేపీ రాజకీయ కుట్రను చెప్పండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మన నోటి హక్కులు తాకట్టు పెట్టింది కేసీఆర్.. కేసీఆర్ ఫ్యామిలీ అంతా అబద్దాల మీద బతుకుతున్నారు.. వాళ్ళ సక్సెస్ సీక్రెట్ కూడా అబద్ధాలు చెప్పడమే అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ సచ్చిన పాము.. బీజేపీ మీద ఫోకస్ పెట్టండి.. కమలం పార్టీని, కేసీఆర్ నీ బతికించే పనిలో కిషన్ రెడ్డి ఉన్నారు.. ఆయన మాట్లాడే ప్రతి మాట.. కేటీఆర్ ఆఫీస్ నుంచి వచ్చే ప్రెస్ నోట్ అని ఆరోపించారు. మేము కిషన్ రెడ్డి దగ్గరికి వెళ్తే.. ఎప్పుడూ మమ్మల్ని కేంద్రం దగ్గరికి తీసుకుపోలేదన్నారు. కిషన్ రెడ్డి తీరు అనుమానాలు కలిగిస్తున్నాయి.. ఇక, బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావుకి శుభాకాంక్షలు.. గోదావరి నదీ జలాల సమస్యను మోడీ దృష్టికి తీసుకెళ్లండి అని సూచించారు. మీ మొదటి కార్యాచరణ ఇదే పెట్టుకోండి అన్నారు. మా అధికారులు మీకు సమాచారం ఇస్తారు.. వాళ్ళు ఇచ్చే సోషల్ మీడియా ప్రకటనలు చూసి కన్ఫ్యూజ్ అవ్వొదు.. తప్పులు చేసింది వాళ్ళే.. వాటిని కప్పి పుచ్చుకునే పనిలో ఉన్నారని తెలిపారు. కేసీఆర్ తో పంచాయతీ కంటే.. తెలంగాణ హక్కులు సాధించుకోవడం ఎలా అనేదే మా లక్ష్యమని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
