Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ సమాశానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అద్యక్షతన ఈ సమావేశం ఈ నెల 20న సాయంత్రం 4 గంటలకు క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ కేబినెట్ లో ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల అంశంలో కోర్టు తీర్పుపై, హైడ్రాకు చట్టబద్దత అంశం, అలాగే 2 లక్షల రుణాల మాఫీ చెల్లింపు, 200 గ్రామ పంచాయతీల ఏర్పాటు, ఆర్డినెన్సు రైతు భరోసాపై కేబినెట్ లో చర్చించనున్నారు. వీటిపై చర్చించి విధి విధానాలపై ఖరారు చేయనున్నారు. కేబినేట్ సమావేశానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అయితే హైడ్రాపై ప్రజల్లో విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Read also: Okra Water: బెండ నీటితో బోలెడు ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదలరు..
కాగా సచివాలయంలో మున్సిపల్ పాలనపై నిన్న అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.. తెలంగాణలో ట్రాఫిక్ నియంత్రణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ స్ట్రీమ్ ను లైవ్ చేయడంలో ట్రాన్స్ జెండర్లను వాలంటీర్లుగా ఉపయోగించుకోవాలని ఆయన ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై అధికారులతో చర్చించినట్లు సమాచారం. ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, మితిమీరిన వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఎంత కఠినంగా అమలు చేస్తున్నా వాహనదారులలో మాత్రం మార్పు రావడం లేదు. చలాన్లు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ ఎవరైనా తప్పులు చేస్తూనే ఉన్నారు. దీంతో ట్రాఫిక్ నియంత్రణపై ట్రాఫిక్ స్ట్రీమ్ ను లైవ్ చేయడంలో ట్రాన్స్ జెండర్లను వాలంటీర్లుగా ఉపయోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్లు తెలుస్తుంది.
KTR: హైదరాబాద్ చేరుకున్న కేటీఆర్.. రెండు వారాల తర్వాత నగరానికి..