IndiGo Flights Delay: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన కొన్ని విమానాల్లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీని కారణంగా పలు ఫ్లైట్‌లు ఆలస్యం అవ్వగా, కొన్ని విమానాలను పూర్తిగా రద్దు చేసినట్లు ఇండిగో విమానయాన సంస్థ ప్రకటించింది. ఇక, ఈ సమస్యపై శంషాబాద్ ఎయిర్ పోర్టు అధికారులు స్పందిస్తూ RGIAలో అన్ని ఆపరేషన్లు సాధారణంగా కొనసాగుతున్నాయని, విమానాశ్రయ కార్యకలాపాల్లో ఎలాంటి అంతరాయం లేదని స్పష్టం చేశారు. విమానాల ఆలస్యాలు, రద్దులు పూర్తిగా ఇండిగో అంతర్గత సమస్యల వల్లేనని వెల్లడించారు. ఇక, ప్రయాణికులు తమ ఫ్లైట్ ప్రస్తుత పరిస్థితి గురించి తాజా వివరాలు తెలుసుకోవడానికి ఇండిగో కస్టమర్ సర్వీస్‌ను నేరుగా సంప్రదించాలని శంషాబాద్ RGIA అధికారులు సూచించారు.