Telangana Panchayat Elections: తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులు, వార్డు మెంబర్ల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో, పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనరేట్‌లో ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ లీగల్ సెల్ ముగ్గురు సూపరిండెంట్ స్థాయి అధికారులతో పర్యవేక్షించబడుతుంది. గతంలో ఎన్నికల రిజర్వేషన్లపై పలు కోర్టు పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో, ఎన్నికల ప్రక్రియను నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి చేయడం, ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవడం కోసం ఈ విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
Read Also: Tirumala Laddu Ghee Adulteration Case: తిరుమల కల్తీ నెయ్యి లడ్డు కేసులో మరో అరెస్టు !
జిల్లాలతో సమన్వయం మరియు కోర్టు పిటిషన్ల పర్యవేక్షణ:
లీగల్ సెల్, జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులతో సమన్వయం చేసి, కేసులకు సంబంధించిన వివరాలు మరియు సూచనలు 24 గంటల్లో అదనపు అడ్వకేట్ జనరల్/గవర్నమెంట్ ప్లీడర్ కి అందించాలి అని ఆదేశాలు జారీ చేయబడ్డాయి. ప్రతి జిల్లాలో కోర్టు కేసులను పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారిని నియమించి, కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన లీగల్ సెల్‌తో సమన్వయం తప్పక ఉండేలా చట్టపరమైన చర్యలు చేపడతామని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజన తెలిపారు. కాగా, తెలంగాణలో మూడు దశలో పంచాయితీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం విదితమే కాగా.. తొలి దశ నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది.. ఇక, కొన్ని పంచాయతీలు, వార్డులు ఏకగ్రీవం అవుతున్నాయి..