ఫోన్ టాపింగ్ కేసులో నేడు మరోసారి సిట్ విచారణకు ప్రభాకర్ రావు హాజరుకానున్నారు. మంగళవారం ప్రభాకర్ రావును సిట్ టీమ్ సుదీర్ఘంగా విచారించింది. ప్రభాకర్‌రావు సెల్‌ఫోన్‌ను అధికారులు సీజ్ చేశారు. అయితే సెల్ఫోన్లో డేటాను డిలీట్ చేసినట్లు గుర్తించారు. దీంతో ప్రభాకర్‌రావు సెల్‌ఫోన్‌ను ఎఫ్ఎస్ఎల్కు అధికారులు పంపించారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కీలకంగా మారనుంది.
ఇది కూడా చదవండి: Hyderabad: మలక్‌పేట్ కాల్పులపై కొనసాగుతున్న దర్యాప్తు.. నిందితులు ఏం చేశారంటే..!
ఇక సెల్‌ఫోన్‌లోని డేటాను బయటకు తీసుకొచ్చేందుకు ఎఫ్ఎస్ఎల్ ప్రయత్నం చేస్తోంది. సెల్‌ఫోన్ డేటా లభిస్తే ప్రభాకర్ రావు ఎవరెవరితో మాట్లాడారో క్లారిటీ రానుంది. అయితే ఆయన మొత్తం మూడు ఫోన్లు ఉపయోగించినట్లు సమాచారం. అయితే ఒక ఫోన్ మాత్రమే అధికారులకు ఇచ్చాడు. మిగతా ఫోన్లు అమెరికాలో వదిలేసినట్లు చెప్పారు. దీంతో ఆ ఫోన్లు కూడా రప్పించాలంటూ ప్రభాకర్‌రావుకు సిట్ అధికారులు ఆదేశించారు. ఇదిలా ఉంటే మంగళవారం జరిగిన విచారణలో ప్రభాకర్‌రావు సమాధానాలు ఇవ్వలేదు. దీంతో బుధవారం మళ్లీ విచారణకు రావాలంటూ ప్రభాకర్ రావును సిట్ ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Fauja Singh: కారు ఢీకొని ప్రముఖ అథ్లెట్ ఫౌజా సింగ్ మృతి.. నిందితుడు ఎన్నారై అరెస్ట్