Minister Ponguleti: వరంగల్ లో బీఆర్ఎస్ నిర్వహించిన రజతోత్సవ బహిరంగ సభలో కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ మంచి సూచన ఇస్తారేమో అనుకున్నాం.. కానీ, ఆయన మనసంతా విషం నింపుకున్నాడు అని మండిపడ్డారు.
Minister Ponguleti: యాదాద్రి జిల్లాలోని వలిగొండ మండల కేంద్రంలో భూ భారతి అవగాహన సదస్సులో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ ప్రజలకు భారంగా మారింది అందుకే భూ భారతి తీసుకొచ్చాం అని పేర్కొన్నారు. ఇక, నలుగురు వ్యక్తులు చేసిన చట్టమే ధరణి.. ధరణి పోర్టల్ అమలు చేసే సమయంలో వంద రోజులు రిజిస్ట్రేషన్లు జరగలేదని ఆరోపించారు.
Minister Ponguleti: తెలంగాణ అసెంబ్లీలో రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ రిలీఫ్, హౌసింగ్, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ శాఖల పద్దులపై చర్చ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ పై ప్రజలు తీర్పు ఇచ్చారు.. మా సభ్యులే కాదు.. మీ వైపు ఉన్న సభ్యులు కూడా ఇబ్బంది పడ్డారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ అసెంబ్లీని ఫేజ్ చేసే దమ్ములేదు.. అందుకే చర్చ లేని సమయంలో.. బడ్జెట్ చదివే సమయంలో అసెంబ్లీకి వచ్చిపోతున్నారు అని మండిపడ్డారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న నీటి ఎద్దడికి కారణం కేసీఆరే.. కేసీఆర్ ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసింది.. కమీషన్ల కోసం శిలా ఫలకాల కోసమే కొత్త ప్రాజెక్టులు తెచ్చారు.. దేవాదులను నిర్లక్ష్యం చేశారు ఆరోపించారు.
KTR: చిత్తశుద్ధి ఉంటే.. హైకోర్ట్ సీజే దగ్గరకు మంత్రి పొంగులేటి నాతో రావాలి.. టెండర్లలో తప్పులేమీ జరగలేదంటే.. రాజకీయ సన్యాసం చేస్తానని మంత్రి పొంగులేటి కి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు.