ఆసుపత్రుల నిర్మాణం ఆలస్యం అవుతుండడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. కుంటిసాకులతో నిర్మాణాలను ఆలస్యం చేయడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంట్రాక్టర్లతో పని చేయించడం కూడా రాదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కోమటిరెడ్డి.
CM Revanth Reddy: కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై అధికారులతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భగా గోషామహల్ లో ప్రతిపాదిత స్థలానికి సంబంధించి శాఖల మధ్య భూ బదలాయింపు ప్రక్రియ, ఇతర పనులను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేటి (డిసెంబర్ 9) నుంచి రెండు రోజులు పాటు అధికారులు పింఛన్ల తనిఖీలు చేయనున్నారు. రాష్ట్రంలో నకిలీ పెన్షన్ దారులను ఏరి వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్ జిల్లాలో ఆలయ నిబంధనలు విస్మరించిన ఒక అధికారిపై సస్పెండ్ అయ్యాడు. అయితే, వింధ్యవాసిని ఆలయంలోనికి పాదరక్షలు ధరించి వచ్చిన అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (అగ్రికల్చర్)ను జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు సస్పెన్షన్ వేటు పడింది.
Pawan Kalyan: అధికారుల తీరు మీద రాష్ట్ర అసెంబ్లీ లాబీల్లో చర్చ కొనసాగింది. మంత్రులను మాయ చేసేలా సమాచారం ఇస్తున్నారని అధికారులపై విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వానికి సంబంధించి సభ్యులు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వడం లేదని మంత్రులు వాపోతున్నారు.
రాష్ట్ర విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో పేర్కొన్న అంశాల పురోగతిపై రేపు కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో సమావేశం. ఈ సమావేశానికి ఏపీ నుంచి అధికారులు హాజరుకానున్నారు.
ఖమ్మం జిల్లా బీసీ నాయకుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణను కాంగ్రెస్ పార్టీలోకి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లు ఆహ్వానించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఉద్దేశించి సీరియస్ గా హెచ్చరికలు జారీ చేశారు.
ఆఫ్ఘనిస్థాన్‌లో పాగా వేశారు తాలిబన్లు.. ఒక్కొనగరం.. ఒక్కొ రాష్ట్రం.. దేశ సరిహద్దులు ఇలా ఏవీ వదలకుండా అంతా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.. ఆఫ్ఘన్ పరిస్థితుల ప్రభావం భారత్‌పై ఎంత మేరకు ఉంటుందనే చర్చ కూడా సాగుతోంది.. ఈ నేపథ్యంలో.. ప్రధాని నరేంద్ర మోడీ.. భద్రతా వ్యవహారాలపై కేబినెట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆఫ్ఘనిస్థాన్ లో పరిస్థితులపై చర్చించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్,…
నిన్నటి వరకు ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌లో భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో అరాచకపాలన మొదలౌతుందని, అనేక ప్రాంతాల్లో అప్పటికే ఆ తరహా పాలన మొదలైందని ప్రజలు భయపడ్డారు. నెల రోజుల క్రితం నుంచి తాలిబన్ల ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో కార్యాలయాలు, పాఠశాలలు తెరుచుకోకపోడంతో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అదేవిధమైన పాలన కొనసాగుతుందని అనుకున్నారు. అయితే, అధికారం మార్పిడి జరుగుతున్న సమయంలోనే తాలిబన్ నేతలు కీలక ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పటికే ఎవరి ఇళ్లలోకి చొరబడొద్దని,…