KTR Formula E-Car Race: ఫార్ములా ఈ-రేస్ కేసు విచారణ సందర్భంగా కేటీఆర్ మొబైల్ ఫోన్లతో పాటు ల్యాప్ టాప్ ఇవ్వాలని ఏసీబీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక, ఏసీబీకి సెల్ ఫోన్లు అప్పగించాలన్న దానిపై కేటీఆర్ సమాధానం ఇచ్చారు. బలవంతంగా వ్యక్తిగతమైన సెల్ ఫోన్లు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి..
రేపు ఈడీ కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు హాజరు కానున్నారు. ఉదయం10.30 గంటలకు ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. నంది నగర్ నివాసం నుంచి 10 గంటలకు బయలుదేరనున్నారు కేటీఆర్. ఫార్ములా-ఈ కార్ కేసులో భాగంగా ఈడీ అధికారులు కేటీఆర్‌ను విచారించనున్నారు.
తాను ఏది మాట్లాడినా సెన్సేషన్ అవుతుందని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఫార్ములా ఈ కార్ రేసు వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందని ఆయన చెప్పారు. కానీ అవినీతి కాలేదని తాను చెప్పలేదన్నారు.
KTR : తెలంగాణకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడం, హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్‌ను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ప్రతిష్టాత్మక ఫార్ములా-ఈ కార్ రేసును రాష్ట్రానికి తీసుకువచ్చామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ వాహన రంగంలో హైదరాబాద్‌ను ప్రధాన గమ్యస్థానంగా అభివృద్ధి చేయాలన్న దీర్ఘకాలిక దృష్టితో ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించామని తెలిపారు. తెలంగాణ మొబిలిటీ వ్యాలీలో ఇన్నోవేషన్, రీసెర్చ్, , తయారీ రంగాల్లో పెట్టుబడులు అందించడం ద్వారా ఉద్యోగాలు సృష్టించడం ప్రభుత్వ ప్రధాన…
ఫార్ములా ఈ-రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నేడు ఏసీబీ విచారణకు హాజరుకానున్నారు. మరోవైపు.. రేపు ఈడీ విచారించనుంది. ఫార్ములా ఈ రేస్ కేసుల్లో ఈ రెండు సంస్థలు దర్యాప్తు ముమ్మరం చేశాయి.
ఫార్ములా ఈ- కార్ రేసు వ్యవహారంపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ముగిసింది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ క్రమంలో.. తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దని న్యాయస్థానం తెలిపింది.
ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్‌తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌పై కేసు నమోదు చేశారు. A-1గా కేటీఆర్, A-2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A-3గా హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని చేర్చింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని ఏసీబీ కేసు నమోదు చేసింది.