Konda Surekha: కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గేది లేదు.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ప్రస్తుత క్యాబినెట్ మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజకీయాలలో మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. కేటీఆర్ నన్ను కించపరిచే విధంగా మాట్లాడాడు అన్నారు. నేను వేదనకు గురై ఆయన గురించి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందన్నారు. అనుకోని సందర్భంలో ఓ కుటుంబం గురించి మాట్లాడాను అన్నారు. అనుకోకుండా నా నోట్లో నుంచి ఆ వ్యాఖ్యలు రావాల్సి వచ్చిందన్నారు. ఆ కుటుంబ సభ్యుల ట్వీట్లు చూసిన తర్వాత నాకు బాధనిపించిందన్నారు. ఆ కుటుంబాన్ని నా వ్యాఖ్యలు నొప్పించాయని తెలిసి బాధపడ్డానని తెలిపారు. నేను పడ్డ బాధ వాళ్లు పడకూడదనే, నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటూ, ట్విట్టర్లో పోస్ట్ చేశానని తెలిపారు. కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గేది లేదని అన్నారు. కేటీఆర్ తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిందే అన్నారు. దొంగే దొంగ అనేలా కేటీఆర్ ప్రవర్తన ఉందన్నారు. కేటీఆర్ నోటీసుల మీద లీగల్ గా ముందుకు వెళ్తానని మంత్రి కొండా సురేఖ అన్నారు.
TPCC Chief Mahesh Goud: సమంత,నాగ చైతన్య వివాదం.. కొండా సురేఖకు పీసీసీ చీఫ్ ఫోన్..