TPCC Chief Mahesh Goud: రాష్ట్ర రాజకీయాలలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ప్రస్తుత క్యాబినెట్ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మంత్రి కొండా సురేఖ నిన్న సమంత, నాగ చైతన్య విడాకులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అధికారంతో అడ్డు అదుపు లేకుండా సభ్య సమాజం సిగ్గుపడేలా తమ స్వార్ధ రాజకీయాల కోసం దిగజారిపోయి మాట్లాడకూడదని పలువురు టాలీవుడ్ హీరోలు సదరు మంత్రిపై ఘాటుగా స్పందించారు. ఓక మహిళా అయి ఉండి సాటి మహిళ వ్యక్తిగత జీవితంపై కామెంట్స్ చేయడం ఎంత వరకు సబబు అనేది సదరు మంత్రి గారు ఆలోచించుకోవాలని మండిపడుతున్నారు. అటు రాష్ట్ర రాజయాల్లోని ప్రముఖులు ఇటు సినిమా ఇండస్ట్రీ మొత్తం కొండా సురేఖ మాటలపై మండి పడుతున్నారు. ఇక తాజాగా దీనిపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు. కొండా సురేఖకు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఫోన్ చేశారు. సమంత.. నాగ చైతన్య వివాదం పై కొండా సురేఖతో స్వయంగా మాట్లాడి వివరణ ఇవ్వాల్సిందిగా సూచించారు. అసలు ఎందుకు ఆ మాటలు వచ్చాయన్న దానిపై తెలుపాలన్నారు. రాజకీయాల్లోకి సినిమా ఇండస్ట్రీ వారి పేర్లను ప్రస్తావించడంపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరారు.
మరోవైపు కాగా కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున, అమల, నాగచైతన్య, సమంత, ఎన్టీఆర్, నాని, మోగాస్టార్ చిరంజీవి, ఆర్టీవీ, ప్రకాష్ రాజ్ సినీతారలు ఘటూగా, రియాక్ట్ అయిన విషయం తెలిసిందే.
Hassan Nasrallah: శుక్రవారం హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లా అంత్యక్రియలు!